” రొమాంటిక్ ” సెట్స్‌కు భారీ ప్రమాదం ..!

October 15, 2019 at 5:35 pm

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాశ్ పూరి క‌థానాయ‌కుడిగా తెరకెక్కుతున్న చిత్రం రొమాంటిక్‌. ఈ చిత్రం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. అయితే ఈ చిత్రం షూటింగ్ నిర్వ‌హిస్తున్న సెట్స్‌లో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. అయితే ఈ అగ్ని ప్ర‌మాదం సాధార‌ణ‌మైందే కావ‌డంతో పెద్ద‌గా ప్ర‌మాదం ఏమీ జ‌రుగ‌లేద‌ట‌. లేకుంటే పెద్ద న‌ష్ట‌మే జ‌రిగేద‌ని స‌మాచారం.

ఆకాశ్ పూరి న‌టిస్తున్న రొమాంటిక్ చిత్రం ఫ‌స్ట్ లుక్ ఇటీవ‌లే విడుద‌ల అయిన విష‌యం తెలిసిందే. ఈ ఫ‌స్ట్‌లుక్‌లో హీరో హీరోయిన్లు కౌగిలించికున్న తీరు చూస్తే సినిమాపై భారీ హైప్ క్రియోట్ అయింది. అయితే ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతున్న త‌రుణంలో సెట్స్‌లో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింద‌ట‌. రొమాంటిక్ సాంగ్ కోసం సెట్ వేసి షూటంగ్ జ‌రుపుతున్నార‌ట‌. అయితే స్పాట్‌లో ముందుగా క‌ర్టెన్ ల‌కు మంట అంటుకుంద‌ట‌..

అగ్ని ప్ర‌మాదంలో క‌ర్టెన్‌లు పూర్తిగా కాలిపోయి, త‌రువాత సోఫాలు, కుర్చిల‌కు అంటుకోబోయే త‌రుణంలోనే చిత్ర యూనిట్ స‌భ్యులు గ‌మ‌నించార‌ట‌. వెంట‌నే మంట‌ల‌ను ఆర్పి వేశార‌ట‌. దీంతో భారీ ప్ర‌మాదం త‌ప్పింద‌ట‌. అయితే స్పాట్లో అగ్ని ప్ర‌మాదం సంభ‌విస్తే ఆర్పే ప‌రిక‌రాల‌ను అందుబాటులో స‌మ‌కూర్చుకోలేద‌ట‌. కేవ‌లం వాట‌ర్ బాటిల్ల‌తోనే మంట‌ల‌ను ఆర్పార‌ట‌. దీంతో చిత్ర యూనిట్ పై న‌టిన‌టులు మండిప‌డుతున్నార‌ట‌..

” రొమాంటిక్ ” సెట్స్‌కు భారీ ప్రమాదం ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts