అరే… ఆర్ ఆర్ ఆర్ పోస్ట‌ర్ అదిరిందే…!

October 22, 2019 at 11:53 am

1920కి ముందు త‌మ హ‌క్కుల కోసం పోరాటం చేసిన ఇద్ద‌రు గిరిజ‌న యోధులు. ఒక‌రు మ‌న్యంలో త‌మ జాతికి దోచుకుంటున్న అడ‌వి బిడ్డ‌లపై పెత్తనం చేస్తున్న బ్రిటీష్ సామ్రాజ్య‌వాదుల‌పై తిరుగుబాటు శంఖం పూరించిన వీర‌యోధుడు అల్లూరి సీతారామ‌రాజు. మ‌రొక‌రు గోండు బిడ్డ‌లకు భూమి, అడ‌వి హ‌క్కుల కోసం జ‌ల్‌, జ‌మీన్‌, జంగ‌ల్ అంటూ పోరు చేసిన పోరుబిడ్డ కొమ‌రమ్ భీమ్‌.. ఈ ఇద్ద‌రి జీవిత క‌థ తెర‌పై ఆర్ ఆర్ ఆర్ అనే వ‌ర్కింగ్‌ టైటిల్ తో సినిమాగా రూపొందుతుంది.

అయితే ఈసినిమాను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ ఎస్ రాజ‌మౌళి ఎంతో ప్రతిష్టాత్మ‌కం తెర‌కెక్కిస్తున్నారు. డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్ పై డివివి దాన‌య్య దాదాపు రూ.300కోట్ల వ్య‌యంతో నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఏడాది కాలం పూర్తి అయింది సినిమా షూటింగ్ ప్రారంభ‌మై.. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ అల్లూరి సీతారామ‌రాజుగా, యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ విప్ల‌వ‌వీరుడు కొమ‌ర‌మ్ భీమ్ గా న‌టిస్తున్నారు

ఆర్ ఆర్ ఆర్ సినిమాను ద‌ర్శ‌క‌ధీరుడు జ‌క్క‌న్న అంద‌మైన శిల్పంగా చెక్కుతుండ‌గా, టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, తార‌క్‌లు న‌టిస్తుండటంతో సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. అయితే ఈ సినిమా ఆప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తారు. ఈ రోజు కొమ‌ర‌మ్ భీమ్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఆర్ ఆర్ ఆర్ మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌పై కొమ‌రం భీమ్ చేతిలో గ‌న్‌తో క‌నిపిస్తున్న ఫోటో ఉంది..అందులో జూనియ‌ర్ ఎన్టీఆర్ భీమ్ వేశ‌ధార‌ణ‌లో త‌ల‌పాగా చుట్టి ఉన్న ఫోటోను వేశారు. ఈ పోస్ట‌ర్‌లో సినిమా విడుద‌ల తేదిని జూన్ 30, 2020గానే ప్ర‌క‌టించారు.. మొత్తానికి సినిమాకు సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌తో సినిమాపై భారీ హైప్‌ను క్రియోట్ చేశారు ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళీ…

అరే… ఆర్ ఆర్ ఆర్ పోస్ట‌ర్ అదిరిందే…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts