శృతి హాసన్ స్ట్రాంగ్ వార్నింగ్ ..!

October 17, 2019 at 4:05 pm

విశ్వ‌న‌టుడు క‌మ‌ల‌హాస‌న్ గారాల ప‌ట్టి శృతిహాస‌న్‌. ద‌క్షిణ భార‌త‌దేశంలోని అన్ని భాషల్లోనూ న‌టించిన ఈ సుంద‌రి, బాలీవుడ్‌లోనూ రాణించింది. కేరీర్ మంచి ఊపులో ఉండ‌గానే ప్రేమ పేరుతో డేటింగ్ చేసి, ఆపై డేటింగ్ చేసిన బాయ్ ప్రెండ్‌కు బ్రేక‌ఫ్ చెప్పి.. తిరిగి త‌న సొంత గూటికి చేరింది ఈ అమ్మ‌డు. ఇప్పుడు మ‌ళ్ళీ సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న స‌మ‌యంలో ఆమే చేసిన వ్యాఖ్యాలే ఆమేకు నిద్ర లేకుండా చేస్తున్నాయి…

ఓ టాక్ షోలో శృతి హాస‌న్ నేను మందు బంద్ చేసాను.. ప్ర‌శాంత‌మైన, ఆనంద‌మైన జీవితాన్ని గ‌డుపుతున్నాన‌ని చెప్పింది. అంతే ఇక నెటిజ‌న్లు శృతిహాస‌న్ పై సోష‌ల్ మీడియాలో ఓ ఆట ఆటుకుంటున్నారు.. శృతిహాస‌న్ పెద్ద తాగుబోతు అన్న‌ట్లుగా ప్ర‌చారం షురూ చేశారు.. అది ఎక్క‌డిదాకా వెళ్ళిందంటే శృతిహాస‌న్ షూటింగ్‌ల మీద కాన్‌సంట్రేష‌న్ దెబ్బ‌తినేంత వ‌ర‌కు వెళ్ళింది. ఇక ఇది భ‌రించ‌లేని శృతిహాస‌న్ మ‌రోమాట లేకుండా రంగంలోకి దిగింది…

నేను ఏమైనా తాగుబోతునా.. నేను మానేసాను అని చెప్పాను.. కానీ సోషల్ మీడియాలో నా వ్యాఖ్యాల‌ను వ‌క్రీక‌రించారు అంటూ శృతిహాస‌న్ నెటిజ‌న్ల‌పై మండిప‌డ్డారు. అంతేకాదండోయ్‌.. ఈరోజుల్లో డ్రింకింగ్ అనేది కామ‌న్‌. డ్రింకింగ్ ఏమైనా ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసేది కాదు.. 2019లో ఉండి కూడా డ్రింకింగ్ విష‌యంలో ర‌హ‌స్యం పాటించ‌డం అనేది హాస్యాస్ప‌దం అంటూ కామెంట్ చేసింది. ఇక ముందు ఎవ‌రైనా అస‌భ్య‌క‌ర వ్యాఖ్యాలు చేస్తే కేసులు పెడ‌తాన‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది అందాల భ‌రిణే శృతిహాస‌న్‌. పాపం శృతిహాస‌న్‌కు ఎంత కాలిందో అందుకే ఇలా నెటిజ‌న్ల‌పై ఫైర్ అవుతుంది..

శృతి హాసన్ స్ట్రాంగ్ వార్నింగ్ ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts