శ్రీరెడ్డి లవర్ హీరోగా ఎంట్రీ క‌న్ఫ‌ర్మ్…!

October 21, 2019 at 4:33 pm

మీటూ అంటూ టాలీవుడ్‌లో సంచ‌ల‌నం రేకెత్తించిన శ్రీరెడ్డి గుర్తుంది క‌దా… సినిమా అవ‌కాశాలు ఇస్తాన‌ని లైంగికంగా త‌న‌ను వాడుకుని న‌న్ను మోసం చేసార‌ని శ్రీ‌రెడ్డి ఓ టాప్ హీరో త‌మ్ముడిపై ఆరోప‌ణ‌లు చేసి టాలీవుడ్ తుప్పు వ‌దిలిన శ్రీ‌రెడ్డి.. ఆమే ఏ సెలెబ్రెటీపై అయితే ఆరోప‌ణ‌లు చేసిందో ఆ సెలెబ్రెటీ ఇప్పుడు హీరోగా మార‌బోతున్నాడ‌ట‌.. శ్రీ‌రెడ్డి హీరో ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీకి సిద్ద‌మ‌య్యింద‌ని టాలీవుడ్‌లో టాక్‌…

ఇంత‌కు శ్రీ‌రెడ్డి హీరో ఎవ్వ‌రో గుర్తుకొచ్చిందా.. శ్రీ‌రెడ్డి ఆరోప‌ణ‌లు చేయ‌గానే అత‌గాడు జాడ‌లేకుండా నెమ్మ‌దిగా అజ్ఞాతంలోకి జారుకున్నాడు.. ఇప్పుడు అజ్ఞాతం వీడి హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ఆయ‌న తండ్రి తెర‌వెనుక ప్ర‌య‌త్నాలు ప్రారంభించార‌ని సిని ప‌రిశ్ర‌మ‌లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇంత‌కు ఈ శ్రీ‌రెడ్డి హీరో ఎవ్వ‌రు అనుకుంటున్నారు.. అదేనండీ.. ద‌గ్గుబాటి కుటుంబ వార‌సుడు అభిరామ్ ద‌గ్గుబాటి…

ద‌గ్గుబాటి సురేష్‌బాబు చిన్న కొడుకు అభిరామ్‌. రానా ద‌గ్గుబాటి స్వ‌యానా సోద‌రుడు. శ్రీ‌రెడ్డిని లైంగికంగా వేధించిన‌ట్టు ఆరోపించింది. దీంతో హీరోగా ఎంట్రీ ఇద్దామ‌నుకున్న అభిరామ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అయితే అభిరామ్ ఇప్పుడు ముంబాయ్ లో ఓ ప్ర‌ముఖ శిక్ష‌కుడి వ‌ద్ద న‌ట‌న‌లో ఓన‌మాలు నేర్చుకుంటున్నార‌ని, త్వ‌ర‌లో తెరంగ్రేటం చేసేందుకు సిద్ద‌మ‌యిన‌ట్లు ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల క‌థ‌నం. త‌న కొడుకును హీరోగా లాంఛింగ్ చేసేందుకు నిర్మాత సురేష్‌బాబు మంచి క‌థ కోసం ఎదురు చూస్తున్నాడ‌ని స‌మాచారం.

శ్రీరెడ్డి లవర్ హీరోగా ఎంట్రీ క‌న్ఫ‌ర్మ్…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts