రాజమౌళి టైటిల్‌పై పెద‌వి విరుపు…!

October 9, 2019 at 11:51 am

ద‌ర్శ‌క‌ధీరుగు ఎస్ ఎస్ రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్‌. ఇంత‌కాలం ఈ టైటిల్‌ను కేవ‌లం వ‌ర్కింగ్ టైటిల్‌గానే వాడుకున్నారు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. అయితే ఇప్పుడు ద‌స‌రా శుభాకాంక్ష‌ల సంద‌ర్భంగా చిత్ర టైటిల్‌ను విడుద‌ల చేశారు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళీ. అయితే ఆర్ ఆర్ ఆర్ టైటిల్ క‌న్నా రాజ‌మౌళి విడుద‌ల చేసిన టైటిల్‌పై అభిమానులు పెద‌వి విరుస్తున్నారు..

ఆర్ ఆర్ ఆర్ అంటే ఏంటీది అనేది అనేక మందిని తొలుస్తున్న ప్ర‌శ్న‌..దీనికి స‌మాధానం ఇంత‌కాలం ద‌ర్శ‌కుడు రాజ‌మౌళీ కాని, హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌లు కూడా చెప్ప‌లేదు. చిత్ర యూనిట్ కూడా ఎక్క‌డ కొంచెం కూడా లీక్ చేయ‌లేదు.. కానీ ద‌స‌రా రోజు విడుద‌ల చేసిన ఆర్ ఆర్ ఆర్ అంటే రామ రౌద్ర రుషితం అంటూ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. అయితే ఈ టైటిల్ చూసిన నెటిజ‌న్లు, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్‌ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు, అటు రాజ‌మౌళి అభిమానులు త‌ట్టుకోలేక పోతున్నారు..

ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి సినిమా టైటిల్‌ను రామ రౌద్ర రుషితం అనే టైటిల్ లోగోను చూస్తే సినిమాకు హైప్ తీసుకురావ‌డానికి రాజ‌మౌళి ఎత్తుగ‌డ వేసార‌ని తెలిసింది. అయితే ఇక్క‌డ ఈ టైటిల్ ను గ‌మ‌నిస్తే.. ఆర్ ఆర్ ఆర్ వ‌ర్కింగ్ టైటిల్‌కు స‌రిప‌డే పేరుతో రామ రౌద్ర రుషితం అంటే ఎవ్వ‌రికి అంతు చిక్క‌దు.. ఎవ‌రికి అర్థం కాదు.. అందుకే ఇది రాజ‌మౌళి టీం నుంచి కాకుండా ఎవ‌రో ఇలా పోస్టు చేసి ఉంటారా లేక సినిమా యూనిటే ఇలా అభిమానుల నుంచి వ‌చ్చే రియాక్ష‌న్ కోసం ఇలా చేశారా అనేది అంతు చిక్క‌డం లేదు.. కాకుంటే సినిమా టైటిల్ ప‌క్కాగా ఇది కాద‌నేది మాత్రం అభిమానులు అనుకుంటున్నారు.. సో ఇది రాజ‌మౌళి ఎత్తుగ‌డ‌నా.. లేక ఆక‌తాయిలా ప‌నా త్వ‌ర‌లో తేలిపోనున్న‌ది…

రాజమౌళి టైటిల్‌పై పెద‌వి విరుపు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts