జ‌ర్న‌లిస్టుగా మారిన టాలీవుడ్ ద‌ర్శ‌కుడు…!

October 17, 2019 at 4:47 pm

నిత్యం కెమెరాతో కుస్తి ప‌డుతూ… న‌టీన‌టుల‌తో యాక్ష‌న్ అని చెప్పే సినిమా ద‌ర్శ‌కుడు ఆయ‌న‌. సాంకేతిక నిపుణుల‌తో స్టార్ కెమెరా అంటూ చెపుతూ త‌న‌లోని నైపుణ్యాన్ని సృజ‌న రూపంలో సినిమాగా రూపొందించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించే ఆ ద‌ర్శ‌కుడు జ‌ర్న‌లిస్టు అయ్యాడు. కాసేపు జ‌ర్న‌లిస్టుగా త‌న క‌లానికి ప‌ని చెప్పారు. ఇంతకు ఎవ‌రా ద‌ర్శ‌కుడు. ఏ ప‌త్రిక జ‌ర్న‌లిస్టుగా మారారు.. ఓ సారి చూద్దాం…

సైరా సినిమా ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి ఈరోజు న‌మ‌స్తే తెలంగాణ ప్ర‌ధాన కార్యాల‌యంకు వెళ్ళారు. అక్క‌డ ఛీప్ ఎడిట‌ర్ క‌ట్టా శేఖ‌ర్‌రెడ్డితో క‌లిసారు. దీంతో న‌మ‌స్తే తెలంగాణ ఎడిట‌ర్ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డిని గెస్ట్ ఎడిట‌ర్‌గా కాసేపు త‌న సీట్లో కూర్చోబెట్టారు. కాసేపు న‌మ‌స్తే తెలంగాణ గెస్ట్ ఎడిట‌ర్‌గా త‌న బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించారు. ఇలా ద‌ర్శ‌కుడు కాస్త జ‌ర్న‌లిస్టుగా అవ‌తారం ఎత్తడం అది కేవ‌లం సురేంద‌ర్‌రెడ్డికి ద‌క్కిన గౌర‌వ‌మే.

ఈ సంద‌ర్భంగా సురేంద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ సైరా సినిమాతో నాకు ద‌క్కిన గౌర‌వ‌మే ఈ గెస్ట్ ఎడిట‌ర్ అవ‌కాశం. నా కేరీర్‌లో ఇదో బెస్ట్ సినిమాగా నిలిచిపోతుంద‌ని సంతోషం వ్య‌క్తం చేశారు ద‌ర్శ‌కుడు. సైరా సినిమా కోసం 13జిల్లాలు తిరిగితే తెలంగాణ సాయుధ పోరాటం గురించి తెలిసింది.. నిజాం ర‌జాకార్ల గురించి తెలిసింది.. ఇప్పుడు ర‌జాకార్ల నేప‌థ్యంతో, తెలంగాణ సాయుధ పోరాటం సినిమా చేసే స‌మ‌యం ఇదే అంటూ త‌న మ‌న‌సులోని మాట చెప్పారు. అంటే సురేంద‌ర్‌రెడ్డి త్వ‌రలో తెలంగాణ సాయుధ పోరాటాన్ని, ర‌జాకార్ల ఇతివృత్తాన్ని నేప‌థ్యంగా సినిమా చేయ‌బోతున్నార‌న్న మాట‌.

జ‌ర్న‌లిస్టుగా మారిన టాలీవుడ్ ద‌ర్శ‌కుడు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts