సైరా టీమ్‌కు బాల‌య్య స‌ర్‌ప్రైజ్ ట్రీట్‌

October 10, 2019 at 12:16 pm

ఇండ‌స్ట్రీలో ఒక్కోసారి ఊహించ‌ని స‌ర్‌ప్రైజ్‌లు ఉంటాయి. తెర‌వెనక ఎంత త‌తంగాలు, ఇగోలు ఉన్నా తెర‌ముందుకు వ‌చ్చేస‌రికి హీరోలు ఒక్కోసారి అంద‌రూ ఒక్క‌టైపోతుంటారు. టాలీవుడ్‌లో అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ మ‌ధ్య ఉన్న పోటీయే వేరు. వీరిద్ద‌రు సినిమాలు ఒకేసారి వ‌స్తుంటే అస‌లు యావ‌త్ తెలుగు ప్రేక్ష‌కులు రెండుగా చీలిపోయి త‌మ అభిమాన హీరో సినిమాయే హిట్ అవ్వాల‌ని కోరుకుంటూ ఉంటారు. ఆ టైంలో థియేట‌ర్ల వ‌ద్ద పెద్ద యుద్ధ‌మే ఉంటుంది.

అలాంటి ఈ ఇద్ద‌రు హీరోలు ఒక హీరో సినిమా హిట్ అయితే మ‌రో హీరో కూడా వ‌చ్చి సెల‌బ్రీట్ చేసుకుని అంద‌రికి షాక్ ఇచ్చారు. ఇది ఇండ‌స్ట్రీలోనే ఊహించ‌ని స‌ర్‌ప్రైజ్ అనే చెప్పాలి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన `సైరా-నరసింహారెడ్డి` గ్రాండ్ సక్సెస్ పార్టీలో నటసింహా నందమూరి బాలకృష్ణ చేసిన సందడి ఫిలిం వర్గాల్లో చర్చకు వచ్చింది. చిరుతో పాటు కొణిదెల టీంకు, ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డికి ఆయ‌న అభినంద‌న‌లు తెలిపారు.

బాల‌య్య ఈ షాకింగ్ ట్రీట్‌లో నానా సంద‌డి చేయ‌డంతో పాటు డిన్న‌ర్ అస్వాదించ‌డంతో కొణిదెల కాంపౌండ్ ఎంతో ఆనందించింది. ఇక కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి ఇచ్చిన సక్సెస్ పార్టీ ఇది. అందుకే ఈ పార్టీలో అగ్ర కథానాయకులు.. సీనియర్ సెలబ్రిటీలు పలువురు కనిపించారు. హైదరాబాద్ పార్క్ హయత్ లో ఈ వేడుక జ‌రిగింది. బాలయ్యతో పాటు విక్టరీ వెంకటేష్, కృష్ణంరాజు సందడి చేశారు. వీరితో పాటు మురళి మోహన్-అల్లు అరవింద్- శ్యామ్ ప్రసాద్ రెడ్డి- దిల్ రాజు- రఘురామ కృష్ణంరాజు తదితరులు సక్సెస్ పార్టీకి హాజరయ్యారు.

సైరా టీమ్‌కు బాల‌య్య స‌ర్‌ప్రైజ్ ట్రీట్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts