సైరా అక్కడ భారీ డిజాస్టరే ..థియేట‌ర్ల రెంట్ల‌కే దిక్కులేదా…!

October 3, 2019 at 11:30 am

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా నిర్మించిన సైరా నిన్న విడుదలై తెలుగులో యావ‌రేజ్ – హిట్ టాక్ మ‌ధ్య ఊగిస‌లాడుతూ బాక్సాఫీస్ జ‌ర్నీ స్టార్ట్ చేసింది. తొలి తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు అయిన ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్ సొంతం చేసుకుంది.

ఇక విమ‌ర్శ‌కులు, ప్రేక్ష‌కులు సైతం చిరు న‌ట‌న సూప‌ర్బ్ అనే ప్ర‌శంసిస్తున్నారు. ఈ ప్ర‌శంస‌లు అన్ని తెలుగుకే మాత్ర‌మే ప‌రిమితం అయ్యేలా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల వ‌ర‌కు సైరాకు ప‌ర్వాలేద‌నిపించే రేంజ్‌లో ప్ర‌శంస‌లు… క‌లెక్ష‌న్లు బాగున్నా నార్త్‌తో హిందీతో పాటు త‌మిళ్‌, మ‌ళ‌యాళంలో సైరా ప‌రిస్థితి ఏ మాత్రం ఆశాజ‌న‌కంగా లేద‌ని తెలుస్తోంది.

సైరా హిందీ వర్షన్ మొదటి రోజు కేవలం 2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిందంటేనే తెలుస్తుంది అక్కడ సైరా పరిస్థితి ఏమిటనేది. బుధ‌వార‌మే య‌ష్‌రాజ్ సంస్థ నిర్మించిన వార్ కూడా రిలీజ్ అయ్యింది. బీ టౌన్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ వంటి స్టార్ హీరోల చిత్రం కావడంతో పాటు, భారీ బడ్జెట్ చిత్రం కావడంతో సైరాకు త‌క్కువ థియేట‌ర్లే ఇచ్చారు.

ఇక వార్ తొలి రోజే ఏకంగా రు.50 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్లు సాధించిందంటున్నారు. ట్విస్ట్ ఏంటంటే హాలీవుడ్ మూవీ జోకర్ కూడా రు. 6 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్ట‌గా సైరా అందులో మూడో వంతు కూడా రాబ‌ట్ట‌లేదు. అటు త‌మిళ్‌, మ‌ల‌యాళంలోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది.

సైరా అక్కడ భారీ డిజాస్టరే ..థియేట‌ర్ల రెంట్ల‌కే దిక్కులేదా…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts