‘ సైరా ‘ బొక్క‌ల లెక్క‌లివే..

October 15, 2019 at 11:05 am

మెగాస్టార్ మెగా మూవీ సైరా సెకెండ్ వీకెండ్ ముగిసింది. ఇక ఈ సినిమా హిట్టా… ప్లాపా ? ఏ ఏరియాలో ఎన్ని వ‌సూళ్లు వ‌చ్చాయ‌న్న లెక్క‌లు మాత్ర‌మే చూడాల్సి ఉంది. థియేట‌ర్ల‌లో సైరా స్లో అయిపోయింది. ఇప్పుడు సినిమా మేక‌ర్లు అఫీషియ‌ల్గా ఏం చెప్ప‌క‌పోయినా బ‌య‌ట‌కు వ‌చ్చిన ఫిగ‌ర్లపై సైరా యాంటీ ఫ్యాన్స్ బాగా ట్రోల్ చేస్తున్నారు.

ఇక ఈ ట్రోలింగ్ వ్య‌వ‌హారాల‌ను కాసేపు ప‌క్క‌న పెడితే వాస్త‌వంగా చూస్తే సీడెడ్, ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు ఏరియాల డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కడం కష్టంగానే కనిపిస్తోంది. సీడెడ్ లో మరో రెండు కోట్లు, గుంటూరులో మరో రెండు కోట్లు, ఈస్ట్ లో మరో కోటిన్నర, వెస్ట్ లో మరో రెండుకోట్లు, కృష్ణాలో కోటిన్నరకు పైగా వసూళ్లు రావాల్సివుంది.

ప్ర‌స్తుతం థియేట‌ర్ల‌లో సైరాకు పోటీగా పెద్ద సినిమాలు లేక‌పోయినా సైరాను మాత్రం రెండోసారి చూసేందుకు ఎవ్వ‌రూ ఇష్ట‌ప‌డ‌డం లేద‌న్న‌ది మాత్రం వాస్త‌వం. తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ ద‌స‌రా సెల‌వులు పొడిగించ‌డంతో అక్క‌డ మాత్రం ప‌ది రోజులు దాటుతున్నా మంచి షేరే వ‌స్తోంది. వైజాగ్‌లో టిక్కెట్ రేట్లు పెంచ‌డంతో పాటు, నైజాంలో వ‌రుస సెల‌వులు సైరాను గ‌ట్టెక్కించేశాయి.

ఏపి, తెలంగాణలో దాటేసింది షేర్ అని అంటున్నా ఇంకా 1,2 కోట్లు రావాల్సి ఉంద‌ని టాక్‌. టోటల్ గా బ్రేక్ ఈవెన్ చూసుకుంటే, ఖర్చులు కాకుండా మరో ఎనిమిది కోట్ల వరకు రావాల్సి వుంటుంది. ఇక తమిళ, మళయాల, కన్నడ, హిందీ వెర్షన్లు డిజాస్టర్లుగా మిగిలాయి. ఓవర్ సీస్ లో కూడా బ్రేక్ ఈవెన్ కు చాలా దూరంగానే వుంది. అంటే ఓవ‌రాల్‌గా సైరా నైజాం, ఉత్త‌రాంధ్ర‌, నెల్లూరు మిన‌హా మిగిలిన అన్ని చోట్ల న‌ష్టాలు మిగ‌ల్చ‌నుంద‌న్న‌ది క్లారిటీ వ‌చ్చేసింది.

‘ సైరా ‘ బొక్క‌ల లెక్క‌లివే..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts