‘ సైరా ‘ లాస్ లెక్క‌లు బ‌య‌ట‌కు వ‌చ్చేశాయ్‌..

October 9, 2019 at 6:09 pm

టాలీవుడ్ సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ ఓ కల్పతరువు అని కొన్ని రోజుల క్రితం వరకూ అనుకునేవారు. స్టార్ హీరోల నుంచి నాని లాంటి హీరోల వ‌ర‌కు అక్కడ భారీ వ‌సూళ్లు కొల్ల‌గొట్టేవారు. ఎందుకో గాని యూఎస్ ప్రేక్ష‌కుల అభిరుచిలో మార్పు వ‌చ్చింది. సినిమా టిక్కెట్ల రేట్లు విప‌రీతంగా పెంచేయ‌డంతో వాళ్లు రివ్యూలు చూసుకుని.. సినిమా టాక్‌ను బ‌ట్టే థియేట‌ర్ల‌కు వెళుతున్నారు. టిక్కెట్ల రేట్లు భారీగా పెంచేయ‌డంతో గ‌తంలోలా వేలం వెర్రీగా సినిమాలు ఎగ‌బ‌డి చూడ‌డం లేదు.

ఇక ఇప్పుడు టాలీవుడ్ సినిమాలు ఓవ‌ర్సీస్ బ‌య్య‌ర్ల‌కు నిద్ర‌లేని రాత్రుల‌ను మిగుల్చుతున్నాయి. 95 శాతం సినిమాల‌కు అక్క‌డ న‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. సైరాను అక్క‌డ 3.3 మిలియ‌న్ డాల‌ర్ల‌కు అమ్మితే ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 2.2 మిలియ‌న్ డాల‌ర్లు మాత్ర‌మే వ‌చ్చాయి. మ‌రో 1.1 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేయాల్సి ఉంది. ఇప్ప‌టికే థియేట్రిక‌ల్ ర‌న్ దాదాపు కంప్లీట్ కావ‌డంతో ఇక న‌ష్టాలు త‌ప్ప‌వ‌ని అర్థ‌మైంది.

సినిమాకు మిక్స్‌డ్ టాక్‌తో పాటు నెగిటివ్ రివ్యూల‌తో క‌లెక్ష‌న్లు త‌క్కువ వ‌చ్చాయంటే అర్ధం చేసుకోవ‌చ్చు.. కానీ హిట్ టాక్ వ‌చ్చినా.. చిరు హీరోగా ఉన్నా కూడా 3 మిలియ‌న్ డాల‌ర్లు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. అంటే ఓవ‌రాల్‌గా 1 మిలియ‌న్‌కు పైగా అక్క‌డ లాస్ రానుంది. సైరా వ‌సూళ్లు ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. సైరా సినిమా యూఎస్ కలెక్షన్స్ సంక్రాంతి సినిమాల బిజినెస్ పై ప్రభావం చూపించడం ఖాయమని అంటున్నారు. ఇక‌పై ఆయా హీరోల గ‌త సినిమాల ఓవ‌ర్సీస్ వ‌సూళ్ల‌ను బ‌ట్టే మ‌రుస‌టి సినిమాకు మార్కెట్ డిసైడ్ చేయ‌నున్నారు.

‘ సైరా ‘ లాస్ లెక్క‌లు బ‌య‌ట‌కు వ‌చ్చేశాయ్‌..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts