‘సైరా’ నుంచి అల్లు అరవింద్ ను దూరం చేసింది ఎవరు ?

October 9, 2019 at 12:43 pm

మెగాస్టార్ చిరంజీవి బావ‌మ‌రిది అల్లు అర‌వింద్‌. ఆయ‌న సిని రంగంలో త‌ల‌పండిన బడా నిర్మాత‌. త‌న సోద‌రి సురేఖ‌ను మెగాస్టార్‌కు ఇచ్చిన‌ప్ప‌టి నుంచి బావ చిరంజీవి అంటే ఎక్క‌డ లేని ప్రేమ‌, అభిమానం, గౌరవం. అలాగే మెగాస్టార్ సినిమాల‌కు మంచి విమ‌ర్శ‌కుడు కూడా అల్లు అర‌విందే అంటే న‌మ్మ‌క‌శ్యం కాదు.. అందుకే మెగాస్టార్ న‌టించిన సినిమాల‌ను ముందుగానే చూసి అది హిట్టా.. ఫ‌ట్టా అని అంచ‌నా వేయ‌డంలో అల్లు అర‌వింద్‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌.

అయితే మెగాస్టార్ చిరంజీవి న‌టించిన త‌న క‌ల‌ల ప్రాజెక్టు సైరా న‌ర‌సింహారెడ్డి. ఈ సినిమా మెగాస్టార్ త‌న‌యుడు మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ నుంచి తెర‌కెక్కించారు. ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమాను విడుద‌ల‌కు ముందే అల్లు అర‌వింద్ ప్ర‌త్యేక షోను వీక్షించారు. అయితే సినిమాపై ఆయ‌న పెద‌వి విరిచిన‌ప్ప‌టికి ఇక మెగాస్టార్ కూడా ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి.

అయితే అతి పెద్ద బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం రూ.300కోట్ల పెట్టుబ‌డి పెట్టారు. నాన్ థ్రియోటిక‌ల్ హ‌క్కుల‌ను భారీగానే అమ్మారు. అయితే థ్రియోటిక‌ల్ హ‌క్కులు మాత్రం కేవ‌లం ర‌రూ.150కోట్ల లోబ‌డే అమ్మారు. కాకుంటే.. ఇప్పుడు థియోట‌ర్ల‌లో సినిమాపై రోజు రోజుకు ఆద‌ర‌ణ త‌గ్గుతుంద‌ట‌. తెలుగు రాష్ట్రాలు.. కర్ణాటక తప్ప మరే ఇతర ప్రాంతంలోనూ ఈ సినిమా కలెక్షన్ అంచనాలను అందుకోలేకు న్నది. ఒవరాల్ గా చూస్తే ఈ సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా క‌థ 12ఏండ్ల క్రిత‌మే అల్లు అర‌వింద్ విన్నాడ‌ట‌..ఆ సినిమాను త‌న బ్యాన‌ర్‌లో చేసేందుకు అర‌వింద్ వెన‌క్కి తగ్గాడ‌ట‌. వెటరన్ హీరోలకు ఈ ప్యాన్ ఇండియా సినిమాలు వర్క్ అవుట్ అయ్యే అవకాశం తక్కువనే సంగతి ఆయనకు ముందే తెలుసు కాబట్టే ఆయన చిరు ‘సైరా’కు దూరంగా ఉన్నారని ఇన్సైడ్ టాక్.

ఈ సినిమాను చిరు మార్కెట్ కంటే డబల్ బడ్జెట్ తో నిర్మించేందుకు ముందుకు రాకపోవడానికి కారణం అదేనని అంటున్నారు.. సో ఏదేమైనా ఇప్పుడు అల్లు అర‌వింద్ ఈ సినిమాకు ఎందుకు దూరంగా ఉన్నాడో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి బోధ ప‌డింద‌ట‌.. సో ఏదేమైనా సైరా చిత్రం వ‌సూళ్ళు చూస్తే అల్లు అర‌వింద్ కు సినిమాపై ఉన్న ముందు చూపు తెలిసిపోతుంది…

‘సైరా’ నుంచి అల్లు అరవింద్ ను దూరం చేసింది ఎవరు ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts