ఆగ‌ని సైరా దందా…!

October 10, 2019 at 6:54 pm

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లై భారీ వసూళ్ళ‌ను సాధిస్తుంది. సినిమా విడుద‌లై నేటికి 8రోజులు పూర్తి చేసుకున్నా కూడా చిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌లో ఎక్క‌డా వెన‌క్కి త‌గ‌డం లేదు. సినిమా బాక్సాఫీసు వ‌ద్ద క‌లెక్ష‌న్లు ఆప‌డం లేదు. ఓ వీరుడి జీవిత క‌థ‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీసు వద్ద త‌న దూకుడును కొనసాగిస్తూనే ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్ప‌టికే నాన్ బ‌హుబ‌లి రికార్డును సొంతం చేసుకుని సిని ప‌రిశ్ర‌మ‌లో త‌న‌దైన మార్క్‌తో ముందుకు పోతుంది. సైరా న‌రసింహారెడ్డి చిత్రం ఎన‌మిదో రోజున క‌లెక్ష‌న్లు చూస్తే త‌న దందాను ఏమాత్రం త‌గ్గ‌కుండా చూసుకుంటుంది. కేవ‌లం ఎనమిదో రోజునే నైజాం ఏరియాలోనే సైరా సినిమా దాదాపుగా రూ.2.47కోట్ల షేర్‌ను సాధించింది మెగాస్టార్ స్టామినాను చూపింది.

సైరా చిత్రంకు ఇప్పుడు ఎదురు లేకుండా పోయింది. సైరా చిత్రం రెండోవారంలోకి అడుగుపెట్టింది. ఇందులో వారంతం రావ‌డంతో సైరా మ‌రింత దూకుడుగా ముందుకు పోనున్న‌ది. శుక్ర‌, శ‌ని, ఆదివారాల‌కు తోడు ద‌స‌రా సెల‌వులు ముగియ‌డంతో ఇక సైరా సినిమాకు తిరుగులేదు. ఏదేమైనా సైరా సినిమా మ‌రింత వ‌సూళ్ళు రాబ‌ట్టుకుని తిరుగులేని సినిమాగా నిలిచిపోనున్న‌ది. సో సైరా మూవీకి మ‌రో వారం వ‌ర‌కు ఎలాంటి డోకా లేద‌ని సిని పండితులు అంచ‌నా వేస్తున్నారు.

ఆగ‌ని సైరా దందా…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts