‘ సైరా ‘ కోసం రంగంలోకి ఏపీ మంత్రి

October 1, 2019 at 11:41 am

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న సైరా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు మ‌రి కొద్ది గంట‌ల టైం మాత్ర‌మే ఉంది. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రు. 280 కోట్ల‌తో తెర‌కెక్కిన ఈ సినిమాకు అద‌న‌పు షోలు, బెనిఫిట్ షోల‌కు ఏపీ ప్ర‌భుత్వం నుంచి ప‌ర్మిష‌న్లు రాలేదు. ఇక తెలంగాణ‌లో బెనిఫిట్ షోలు, అద‌న‌పు షోల విష‌యంలో కేసీఆర్ ప్ర‌భుత్వం చాలా స్ట్రిక్ట్‌గా ఉంటోంది. ఏ హీరో సినిమాకు కూడా ప‌ర్మిష‌న్లు ఇవ్వ‌డం లేదు. ఏపీలో మాత్రం కొన్ని సినిమాల విష‌యంలో ఈ మిన‌హాయింపులు ఉంటున్నాయి. అయితే సైరా విష‌యంలో మాత్రం ఇంకా ఈ ప‌ర్మిష‌న్లు రాక‌పోవ‌డంతో మెగా అభిమానులు షాక్ అవుతున్నారు.

మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం క‌ల్లా దీనిపై క్లారిటీ వ‌స్తుందంటున్నారు. అస‌లు ఈ అద‌న‌పు షోల విష‌యంలో యూనిట్ ఏం చేస్తుందో ? కూడా క్లారిటీ లేదు. ఇక మేక‌ర్స్ కూడా ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏపీ మంత్రి, చిరు స‌న్నిహితుడు అయిన కుర‌సాల కన్నబాబు ద్వారా ప్రయత్నిస్తున్నారన్నది. కానీ ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియదు. ఎందుకంటే జ‌న‌సేనానికి ఫ్యామిలీకి చెందిన సినిమా ఇది.

పైగా సినిమాటోగ్రఫీ మంత్రిత్వశాఖ సిఎమ్ జగన్ దగ్గర వుండడం వల్ల ఎవ్వరూ జోక్యం చేసుకుంటారు? అన్నది పాయింట్. మరోపక్కన నిర్మాత, బయ్యర్ దిల్ రాజు తన సర్కిల్ లో ట్రయ్ చేస్తున్నారని వినిపిస్తోంది. మధ్యాహ్నం ఒంటి గంటలోపు అదనపు ఆటలకు ఆదేశాలు వస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. అటు మెగా అభిమానులు, బ‌య్య‌ర్లు మాత్రం అద‌న‌పు షోల‌కు ప‌ర్మిష‌న్లు వ‌స్తాయ‌ని ఉత్సాహంతో ఉన్నారు. ఏదేమైనా అద‌న‌పు షోల‌కు ప‌ర్మిష‌న్లు లేక‌పోతే సైరా బ‌య్య‌ర్ల‌కు కాస్త ఇబ్బందే అవుతుంది. అలాగే తొలి రోజు ఓపెనింగ్స్‌కు కూడా దెబ్బ ప‌డుతుంది.

‘ సైరా ‘ కోసం రంగంలోకి ఏపీ మంత్రి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts