టీడీపీకి భారీ షాక్‌… బీజేపీలోకి ‘ తోట ‘ జంప్‌

October 3, 2019 at 10:59 am

ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. అసలే ఇబ్బందుల్లో ఉన్న టీడీపీకు నేతల పార్టీ మార్పు నిర్ణయాలు మరింత ఇబ్బంది పెడుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేసిన విశాఖ జిల్లాలో సీనియర్‌ నాయకుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ తోట నగేష్‌, టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. గ‌త టీడీపీ ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం నెల‌కొంది.

ఇప్ప‌టికే చాలా మంది టీడీపీ నేత‌లు అటు వైసీపీ వైపో.. లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపో చూస్తోన్న సంగ‌తి తెలిసిందే. కొంద‌రు నేత‌లు కేసుల బాధ‌ల నుంచి త‌ప్పించుకునేందుకు సైతం కూడా అధికార పార్టీల వైపు చూస్తున్నారు. కొంద‌రు అధికారం కోసం అర్రులు చాస్తూ తెలుగుదేశం పార్టీలో కొనసాగడానికి చాలామంది నేతలు భయపడుతున్నారు.

ఇక గ‌త ఐదేళ్లుగా చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో వర్గాలుగా విడిపోయిన టీడీపీ నాయకులు ఒకటిగా కలిసే అవకాశం కనిపించడం లేదు. కీల‌క‌మైన విశాఖ జిల్లాలోనే ఇప్ప‌టికే అన‌కాప‌ల్లి ఎంపీగా పోటీ చేసిన అడారి ఆనంద్‌కుమార్‌తో పాటు ఆయ‌న సోద‌రి య‌ల‌మంచిలి మాజీ మునిసిప‌ల్ చైర్‌ప‌ర్సన్ పిల్లా రమాదేవి సైతం పార్టీ కండువాలు మార్చేశారు. ఇక పాయ‌క‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కీల‌క నేత‌గా ఉన్న తోట నగేష్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

నియోజ‌క‌వ‌ర్గంలో గ్రూపు రాజ‌కీయాల‌తో విసిగిపోయిన ఆయ‌న ఎన్నికలు ముగిసి 5 నెలలైనా పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు రాకపోవడంతో టీడీపీకి గుడ్ బై చెప్పడానికి తోట నగేష్ సిద్ధమయ్యారు. ఇక పార్టీ మారేందుకు సిద్ధ‌మైన తోట న‌గేష్ ఇప్ప‌టికే త‌న అనుచ‌రుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. బీజేపీలో ఆయ‌న‌కు జిల్లా లేదా రాష్ట్ర స్థాయిలో ఏదో ఒక ప‌ద‌వి ఇచ్చే అవ‌కాశం ఉంది.

టీడీపీకి భారీ షాక్‌… బీజేపీలోకి ‘ తోట ‘ జంప్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts