వెంకిమామ‌కు సుడి తిరిగింది…!

October 16, 2019 at 10:59 am

విక్ట‌రీ వెంక‌టేశ్‌, అక్కినేని నాగ‌చైత‌న్య మామా అల్లుల్లుగా న‌టిస్తున్న చిత్రం వెంకిమామ‌. ఇద్ద‌రు నిజ‌జీవితంలోనూ మామ అల్లుండ్లే.. ఇక ఇదే లైన్‌లో ఇద్ద‌రిని మామ అల్లుండ్లుగా మ‌ల్టీస్టార‌ర్ సినిమా తెర‌కెక్కుతుంది. ఇప్ప‌టికే సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావ‌స్తుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే నిర్మాణాంతర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సంక్రాంతి బ‌రిలో నిలువాల‌ని తెగ ఉబ‌లాట ప‌డుతుంద‌ట చిత్ర యూనిట్‌.

అయితే వెంకిమామ అక్టోబ‌ర్, లేదా న‌వంబ‌ర్‌లో విడుద‌లు చేయాల‌ని అనుకున్నారు. కానీ ఎందుకో వాయిదా ప‌డింది. త‌రువాత దాన్ని డిసెంబ‌ర్ మూడో వారంలో విడుద‌ల చేయాల‌నుకున్నారు. అది కూడా సాధ్యం కాలేదు.. దీంతో ఇక మిగిలింది సంక్రాంతి పండుగే.. అందుకే సంక్రాంతి బ‌రిలో నిలువాల‌ని నిర్ణ‌యించుకున్నారు. జ‌న‌వ‌రి 11న విడుద‌ల చేస్తే బాగుంటుంద‌ని అనుకున్నార‌ట‌. దీంతో మిగ‌తా హీరోల‌కు దిమ్మ తిరిగింది. ఇదే స‌మ‌యంలో అటు ప్రిన్స్ మ‌హేష్ బాబు, అటు అల్లు అర్జున్ సినిమాలు ఉన్నాయి..

దీంతో వెంకిమామ కూడా సంక్రాంతి బరిలో నిలిస్తే.. ఇక ఈ రెండు సినిమాల ప‌ని గోవిందా అని భావించిన నిర్మాత‌లు మ‌ద్యే మార్గంగా ఓ ప్ర‌తిపాద‌న చేసారు. ఈ ప్ర‌తిపాద‌న‌తో వెంకిమామ సుడి తిరిగింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ రెండు సినిమాల నిర్మాత‌లు వెంకిమామ చిత్ర నిర్మాత సురేష్‌బాబు వ‌ద్ద‌కు రాయ‌భారం పంపార‌ట‌. సినిమాను డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేసుకుంటే ఏసినిమాను విడుద‌ల కాకుండా ఆపుతామ‌ని, కేవ‌లం వెంకిమామే విడుద‌ల అయ్యేలా చూస్తామ‌ని ఆఫ‌ర్ ఇచ్చార‌ట గిల్డ్‌.. దీనిపై సురేష్‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో గాని ఇది ఒప్పుకుంటే వెంకిమామ పంట పండిన‌ట్లే…

వెంకిమామ‌కు సుడి తిరిగింది…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts