వెంకిమామ బుక్క‌య్యాడోచ్‌…!

October 15, 2019 at 4:11 pm

రియ‌ల్ జీవితంలో మామ అల్లుండ్లు అయిన వీరు రీల్ జీవితంలో కూడా మామ అల్లుండ్లుగా న‌టిస్తున్నారు. ఇప్పుడు ఈ మామ అల్లుండ్ల‌తో వ‌స్తున్న సినిమా రిలీజ్‌కు డేట్‌ను ఫిక్స్ చేసుకున్నార‌ట‌.. సిని ప‌రిశ్ర‌మ‌లో వ‌స్తున్న ఊహ‌గానాల ప్ర‌కారం ఈ సినిమా జ‌న‌వ‌రి 11న విడుద‌ల చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ట మామ అల్లుండ్లు.. సంక్రాంతి బ‌రిలో మేము అని వెంకిమామ స‌వాల్ విసురుతున్నారు.

కె. ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్నవెంకిమామ‌ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఇది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా నటిస్తుండగా, వెంకటేష సరసన పాయల్ రాజ్ పుత్ న‌టిస్తుంది.

అయితే ఈ సినిమా విడుద‌ల త్వ‌రలో ఉంటుంది అని చెపుతున్న‌ప్ప‌టికి విడుద‌ల ముందుకు సాగ‌డం లేదు. అందుకే వెంకిమామ చివ‌రికి సంక్రాంతి బ‌రిలో నిలిచేందుకే స‌న్న‌ద్ద‌మ‌య్యాడ‌ట‌. జ‌న‌వ‌రి 11న సినిమాను విడుదల చేయాల‌ని అన‌ధికార స‌మాచారం. ఇప్ప‌టికే సంక్రాంతి బ‌రిలో ప్రిన్స్ మ‌హేష్‌బాబు, స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్‌, నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్‌తో పాటు ప‌లువురు ముందుగానే క‌ర్చీఫ్ వేసుకున్నారు. ఇప్పుడు వెంకిమామ కూడా క‌ర్చిఫ్ వేస్తున్నాడు..

వెంకిమామ బుక్క‌య్యాడోచ్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts