విజయ్ ‘విజిల్’ రివ్యూ అండ్ రేటింగ్‌..హిట్టా ఫట్టా ?

October 25, 2019 at 4:30 pm

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సినిమాకు తెలుగులో బాగానే క్రేజ్ ఉంటుంది. ఆయ‌న న‌టించిన తుపాకి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులను అల‌రించి భారీ అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. తెలుగు ప్రేక్ష‌కులు విజ‌య్ సినిమాను బాగానే ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన త‌మిళ‌ చిత్రం బిగిల్‌. ఇదే చిత్రాన్ని విజిల్ పేరుతో తెలుగులో విడుద‌ల చేసారు. ఈ సినిమా ఈరోజు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది. ఈ సినిమా ఎలా ఉందో ఓసారి చూద్దాం.

క‌థ : ఓ బ‌స్తీలో ఉండే పేదల‌కు సాయం చేస్తుండాడు మైఖేల్ ( విజ‌య్ ). ఆయ‌న తండ్రి రాజ‌ప్ప అదే బ‌స్తీలో తిరుగులేని రౌడీగా ఉంటాడు. రాజ‌ప్ప‌ త‌న కొడుకైన మైఖేల్‌ పెద్ద పుట్‌బాల్ ప్లేయ‌ర్ కావాల‌ని, జాతీయ‌స్థాయిలో బోలేడు క‌ప్పులు గెలుచుకోవాల‌ని ఆశిస్తాడు. కానీ మైఖేల్ పుట్‌బాల్ ప్లేయ‌ర్‌గా క‌న్నా పేద‌ల‌కు సాయం చేయ‌డంలోనే ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతాడు. అయితే ఓ కాలేజీని క‌బ్జా చేయాల‌ని ఓ రాజ‌కీయ నాయ‌కుడు చూస్తుంటాడు. వీరికి అండ‌గా మైఖేల్ ఉంటాడు.. ఇలా త‌న తండ్రి వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తాడు. మైఖేల్ దోస్తు పుల్‌బాల్ కోచ్‌. అయితే ప్ర‌మాదంలో గాయ‌ప‌డుతాడు. అప్పుడు స్నేహితుడి కోసం మైఖేల్ పుట్‌బాల్ కోచ్ అవుతాడు. కానీ విద్యార్థులు మైఖేల్‌ను రౌడీగానే చూస్తూ కోచ్‌గా నిరాక‌రిస్తారు. త‌రువాత మైఖేల్ ఎందుకు పుట్‌బాల్ మానేసాడు. విద్యార్థుల మ‌న‌స్సు ఎలా గెలిచాడు. త‌రువాత పుట్‌బాల్ ఛాంపీయ‌న్ షిప్‌ను ఎలా సాధించారు అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

న‌టీన‌టుల న‌ట‌న : విజ‌య్ రాజ‌న్న‌గా, మైఖేల్‌గా న‌టించిన తీరు అద్భుతంగా ఉంది. రెండు వేరియేష‌న్స్‌లో మూడు ద‌శ‌ల్లో న‌టించిన తీరు ఆక‌ట్టుకునేలా ఉంది. ఇక హీరోయిన్ న‌య‌న‌తార‌తో చేసే రోమాన్స్ బాగానే ఉన్నా న‌య‌న‌తార‌ను కేవ‌లం ఇందులో ఓ సెంట‌రాఫ్ ఎట్రాక్ష‌న్‌గానే వాడుకున్నారు. ఇక విల‌న్‌గా జాకీష్రాఫ్‌, వివేక్‌, యోగిబాల వంటి సీనియ‌ర్ క‌మెడీయ‌న్లు సినిమాలో త‌న పాత్ర‌ల మేర‌కు రాణించారు.

సాంకేతిక నిపుణులు : సినిమాను అట్లీ త‌న‌దైన ప‌ద్ద‌తిలో ముందుకు తీసుకుపోయాడు. ఓ గేమ్ నేప‌థ్యంలో తీసుకుని దానికి రౌడీయిజాన్ని జొప్పించిన తీరు బాగ‌నే ఉంది. ఇక ద‌ర్శ‌కుడు విజ‌య్‌, న‌య‌న‌తార‌ల‌పై ల‌వ్ స‌న్నివేశాలు తీయ‌డంలో బాగానే శ్ర‌ద్ద చూపారు. ఇక జాకీష్రాఫ్‌ను అనుకున్నంత‌గా వాడుకోవ‌డంలో అట్లీ విఫ‌లం అయ్యాడు. ఇక సంగీతం అందించిన ఏఆర్ రెహ‌మాన్ త‌న స్థాయి మేర‌కు సంగీతం అందిచ‌డంలో విఫ‌లం అయ్యాడ‌నే చెప్ప‌వ‌చ్చు. కాకుంటే వీ ఎఫ్ ఎక్స్, బీజీఎంలో త‌న ప్ర‌తిభ‌ను చూపాడు. ఇక జీకే విష్ణు వీడియోగ్ర‌ఫీ చాలా బాగుంది. మొత్తానికి టెక్నిషియ‌న్స్ త‌మ‌వంతుగా విజిల్ వేసార‌నే చెప్ప‌వ‌చ్చు.

చివ‌రిగా : సినిమా ఫ‌స్టాఫ్ అంతా విజ‌య్ రాజ‌న్న‌గా ఎంట‌ర్ అయ్యాడో అప్ప‌టి నుంచి గేర్ మార్చింది. అంత‌కు ముందు ఫుట్‌బాల్ గురించి చెప్పిన‌ప్ప‌టికి ఫ‌స్టాఫ్ అంతా బాగానే ఉంది. ఇక సెకండాఫ్ విష‌యంలో మైఖేల్ త‌న పాత జ్ఞాప‌కాల్లోకి వెళ్ళ‌డం, అందులో ఉండే ట్వీస్ట్‌లు చెప్ప‌డంతో సినిమాకు మ‌రింత హైప్ వ‌చ్చింది. అట్లీ విజ‌య్ ల కాంబీనేష‌న్ వ‌చ్చిన ఈ సినిమా ఇంత‌కు ముందు తేరి (పోలీసోడు), మెర్స‌ల్ (అదిరింది) చిత్రాలు విజ‌యం సాధించాయి. ఇప్పుడు మూడో చిత్రం ముచ్చ‌ట‌గా విజ‌యం సాధించిన‌ట్లే.. మొత్తానికి చిత్రం బాగుంద‌ని చెప్ప‌వ‌చ్చు. క్కకపోయినా తమిళ్‌లో వర్క్ అవుట్ అవుతుంది. ఆర్.ఆర్. బావుంది. G.K.విష్ణు సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్. నిర్మాణ విలువలకు తిరుగులేదు.

టీజే రేటింగ్ : 3/5

విజయ్ ‘విజిల్’ రివ్యూ అండ్ రేటింగ్‌..హిట్టా ఫట్టా ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts