న్యాయ‌పోరాటానికీ ఇంత ఉలుకా? జ‌గ‌న్‌పై ఎందుకింత వ్య‌తిరేక‌త‌?

October 16, 2019 at 2:40 pm

బ‌ల‌వంతుడు మీద‌ప‌డి మ‌న హ‌క్కులు కాల‌రాస్తున్న‌ప్పుడు.. ఏం చేయాలి? అంత‌క‌న్నా బ‌ల‌మైన వ్య‌వ‌స్థ‌ను ఆశ్ర‌యించాలి. అదే ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేస్తోంది. కేంద్రం నుంచి ఎదుర‌వుతున్న ఆదేశాలు, హు కుంల‌కు ప్ర‌భుత్వం ప్లీజ్‌.. ప్లీజ్‌.. మా పాల‌నేదో మ‌మ్మ‌ల్ని చేసుకోనివ్వండి. అస‌లే ఆర్థిక క‌ష్టాల్లో ఉన్న రా ష్ట్రం.. విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌తో అల్లాడిపోతున్నాం.. మీరుకొంత సంయ‌మ‌నం పాటించండి.. ప్లీజ్‌! అంటూ ..కేంద్రానికి మొర పెట్టుకుంటోంది. అయితే, రాష్ట్ర ప‌రిస్తితి తెలిసి ఉండి కూడా.. కేంద్రం రాజ‌కీయ దురుద్దేశంతో రాష్ట్రంపై ప‌డి చండుకు తింటానంటే.. ఎవ‌రైనా ఏం చేస్తారు.. న్యాయ‌వ్య‌వ‌స్త‌ను ఆశ్ర‌యిస్తారు.

ఏపీలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వం కూడా ఇప్పుడు ఇదే చేసింది. సౌర‌, ప‌వ‌న విద్యుత్‌ల‌కు సంబంధించి చేసుకున్న పీపీఏల విష‌యంలో బిల్లుల చెల్లింపుల‌కు కొంత గ‌డువు ఇవ్వాల‌ని స‌ద‌రు కంపెనీల‌ను కోరింది. అయితే, విద్య‌త్ ఎక్సేంజీలు మాత్రం ఈ విజ్ఞ‌ప్తుల‌ను తోసిరాజ‌న్నాయి. అదేస‌మ‌యంలో కేంద్రం కూడా జోక్యం చేసుకుని ఎప్ప‌టిక‌ప్పుడు బిల్లులు చెల్లిస్తేనే విద్యుత్‌ను అందిస్తాయ‌ని స‌ద‌రు కంపెనీల‌కు ఒత్తాసు ప‌లికింది. ఇదే విష‌యాన్ని దేశం మొత్తం అమ‌లు చేయాల‌ని ఆదేశించింది. అయితే, మిగిలిన రాష్ట్రాల ప‌రిస్థితి వేరు.. ఏపీ ప‌రిస్థితి వేరు. క‌నిక‌రించండి.. మేం వీలు చూసుకుని ఒక నెల‌లోగా బిల్లులు చెల్లిస్తామంటూ.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం కేంద్రాన్ని వేడుకుంది.

అయినా కూడా కేంద్రం క‌నిక‌రించ‌లేదు. దీంతో విధిలేని ప‌రిస్థితిలో రాష్ట్రం డిస్కంలు హైకోర్టును ఆశ్ర యించాయి. దీంతో ప్ర‌భుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు చెప్పింది. ఎల్‌సీ(లెట‌ర్ ఆఫ్ క్రెడిట్‌)లు ఇవ్వ‌క‌పోయినా.. ప్ర‌భుత్వానికి విద్యుత్‌ను నిలుపుద‌ల చేయొద్దంటూ.. ఆదేశాలు జారీ చేసింది. ఇది సా ధార‌ణంగా ఏ ప్ర‌భుత్వ‌మైనా.. పౌరుడైనా..త‌న‌కు ఇబ్బంది క‌లిగించే వ్య‌వ‌స్థ‌పై న్యాయ‌పోరాటానికి దిగు తారు. కానీ, రాష్ట్రంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏదో చేయ‌రాని నేరం చేసిన‌ట్టు చంద్ర‌బాబు అండ్ టీం స‌హా ఆయ‌న అనుకూల మీడియా పుంఖాను పుంఖాలుగా వార్త‌ల‌ను వండి వార్చింది.

కేంద్రంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం క‌య్యానికి దిగుతోంద‌ని, భ‌విష్య‌త్తులో ఏపీ మ‌రిన్ని ఇబ్బందులు ఎదుర్కొన డం ఖాయ‌మ‌ని స‌ద‌రు బాబు అనుకూల మీడియా పెద్ద ఎత్తున క‌థ‌నాలు రాసింది. మీడియా ఒక బాధ్య‌త గా రాసి ఉంటే.. ఎవ‌రికీ ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ, రాజ‌కీయ ఉద్దేశాల‌ను అంట‌గ‌డుతూ.. ఇలా లేని పోని క‌థ‌నాలు వండి వార్చ‌డంపైనే ఇప్పుడు సామాన్యుల నుంచి మేధావుల వ‌ర‌కు కూడా స‌ద‌రు మీడి యాపై నిప్పులు చెరుగుతున్నారు. ఇక‌, చంద్ర‌బాబు పై కూడా ఇదే త‌ర‌హాలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. గ‌తంలో ఐదేళ్లు పాలించిన అనుభ‌వం ఉన్న ఆయ‌న‌కు రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి తెలియ‌దా? అంటూ నిప్పులు చెరుగుతున్నారు. ఏదేమైనా.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌న‌కు న్న హ‌క్కును వినియోగించుకుని కోర్టును ఆశ్ర‌యించ‌డాన్ని మెజారిటీ ప్ర‌జ‌లు స్వాగ‌తిస్తున్నారు.

న్యాయ‌పోరాటానికీ ఇంత ఉలుకా? జ‌గ‌న్‌పై ఎందుకింత వ్య‌తిరేక‌త‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts