కెసిఆర్,జగన్ ఢిల్లీ టూర్ వెనుక రహస్యాలు !

October 3, 2019 at 2:48 pm

ఏపీ-తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ సీఎం కెసిఆర్ నేడు ఢిల్లీకి పయనమవుతుండగా రేపు ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు.ఒక‌రోజు లేటుగా ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా ఢిల్లీ ప‌యణ‌మ‌వుతున్నారు. అదే రోజు ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ కానున్నారు. ఈమేరకు సీఎంఓ ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే ఇద్ద‌రు సీఎంలు కూడ‌బ‌ల్కున్న‌ట్లుగా ఒకేసారి ఢిల్లీ ప‌య‌నం కావడం వెనుక మ‌ర్మం ఏంటో ఎవ‌రికి అంతు చిక్క‌డం లేదు. అయితే ఇద్ద‌రు సీఎంలు ఢిల్లీకి ఓకేసారి వెళుతున్న త‌రుణంలో దీని వెనుక ఏదో పెద్ద త‌తంగమే ఉంటుంద‌ని అంతా భావిస్తున్నారు.

అయితే రాజ‌కీయ విశ్లేష‌కుల అంచనా ప్ర‌కారం ఇద్ద‌రు సీఎంలు పీఎం న‌రేంద్ర‌మోడీతో భేటీ వెనుక భారీ స్కేచ్ ఉన్న‌ద‌ట. ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం న‌ల్ల‌మ‌ల అడ‌వుల్లో చేప‌ట్టిన యురేనియం త‌వ్వకాల‌ను ఆపాల‌ని రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు తీర్మాణించాయి. యురేనియం త‌వ్వ‌కాల‌కు వ్య‌తిరేకంగా ఇద్ద‌రు సిఎంలు ప‌నిచేస్తుండ‌టంతో కేంద్రం గుర్రుగా ఉంద‌ట‌.. ఈ యురేనియం త‌వ్వ‌కాల‌పై పీఎం న‌రేంద్ర‌మోడీని కలిసి వాస్త‌వ ప‌రిస్థితుల‌ను వివ‌రించ‌నున్నార‌ట‌. దీనికి తోడు ఎలాగు ఇరు రాష్ట్రాల‌కు సంబంధించిన విభ‌జ‌న స‌మ‌స్య‌లు ఉండ‌నే ఉన్నాయి.

ఇటీవ‌ల రెండు రాష్ట్రాల సీఎంలు హైద‌రాబాద్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో భేటీ అయ్యి గోదావ‌రి, కృష్ణా న‌దుల అనుసంధానంపైన‌, విభ‌జ‌న ఆంశాల‌పైన చ‌ర్చించారు. కేంద్ర ప్ర‌భుత్వం గ‌తంలోనే న‌దులు అనుసంధానంకు ప్రాధాన్య‌త ఇస్తూ అనేక న‌దుల‌ను అనుసంధానం చేయాల‌ని ప్ర‌తిపాదించింది. ఇప్పుడు ఇరు రాష్ట్రాల సీఎంలు గోదావ‌రి, కృష్ణా న‌దులు అనుసంధానంకు ముందుకు రావ‌డంతో ఈ విష‌యంపై పీఎం న‌రేంద్ర‌మోడీతో భేటీ సంద‌ర్భంగా వివ‌రించి చెప్ప‌నున్నారు. దీనికి తోడు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ‌కు ఏదైనా జాతీయ ప్రాజెక్టు కావాల‌ని గ‌త కొంత‌కాలంగా పీఎంను కోరుతున్నారు.

అందులో భాగంగా కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిధులు ఇవ్వాల‌ని, మెట్రో రైలు పొడిగింపుకు స‌హాయంతో పాటు అనేక స‌మ‌స్య‌ల‌ను పీఎం మోడీ దృష్టికి తీసుకురానున్నార‌ట‌.. ఇక ఏపీ సీఎం జ‌గ‌న్ ఏపీలో రాజ‌ధాని నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టులు, పోల‌వ‌రం రివ‌ర్స్ టెండ‌రింగ్‌తో జ‌రిగిన లాభాలు, ఏపీ విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌ధాని మోడీ దృష్టికి తేనున్నార‌ట‌. రైతు భరోసా పథకం ప్రారంభోత్స‌వానికి ప్రధానిని ఆహ్వానించనున్నారు. ఏదేమైనా ఇద్ద‌రు సీఎంలు కొద్ది తేడాల‌తో పీఎం మోడీని క‌లువాల‌ని నిర్ణ‌యించ‌డం యాదృశ్చిక‌మేనో.. లేక అనుకోని తీసుకున్న నిర్ణ‌య‌మో తెలియాలి మ‌రి..

కెసిఆర్,జగన్ ఢిల్లీ టూర్ వెనుక రహస్యాలు !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts