ఏపీ కేబినెట్లో లీకు వీరుడు ఎవ‌రు… జ‌గ‌న్ వేట స్టార్ట్‌…?

October 22, 2019 at 11:00 am

ఏపీలో ఐదేళ్ల టిడిపి ప్రభుత్వంలోనూ ….ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలోనూ మీడియాపై ఆంక్షలు ఉన్నమాట నిజం. టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టిడిపికి బాజా మోగించే మీడియా ఎక్కువగా ఉండడంతో వాళ్ళు చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. చివరకు చంద్రబాబు సైతం తమకు వ్యతిరేకంగా ఉన్న జర్నలిస్టులను ఆ ఛానల్స్ నుంచి తప్పించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేశారో రాష్ట్ర ప్రజలు అందరూ గమనించాను. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సహజంగానే టిడిపి మీడియాను దూరం పెడుతున్నారు. జగన్ సీఎం అయి నాలుగు నెలలు అయిందో లేదో టీడీపీ మీడియా అప్పుడే చిన్న చిన్న తప్పులను కూడా భూతద్దంలో పెట్టి చూపించేస్తోంది.

ఈ క్రమంలోనే మీడియాపై ఆంక్షలు కేసులు పెట్టేందుకు జగన్ వివాదాస్పద జీవో తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేబినెట్ భేటీలో కూడా చర్చ జరిగిందని అంటున్నారు. ఈ వివరాలు కూడా చాలా ర‌హ‌స్యం. అయితే భేటీ పూర్తి అయిందో లేదో ఈ జీవో మ్యాట‌ర్ బయటకు లీక్ అవ్వడం… సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది. కేబినెట్ భేటీలో నిరాధారమైన రాసే వార్తా పత్రికలు… మీడియా ఛానెల్స్‌పై మాత్రమే కేసులు న‌మోదు చేసే అధికారాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం ఇలాంటి జీవో తీసుకురాగా అప్పట్లో దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆ జీవోను ఉపసంహరించుకున్నారు. ఇక ఇప్పుడు జగన్ సైతం క్యాబినెట్ భేటీలో తీసుకున్న అత్యంత రహస్యమైన ఈ నిర్ణయం క్షణాల్లోనే ఎలా బయటకు వెళ్లిందని… ఈ అంశంపై ఆరా తీయాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. కేబినెట్ భేటీలో కీలక అధికారులతో పాటు మంత్రులు మాత్రమే ఉంటారు. ఎవరికి వారు తమకు తెలియదని చెబుతున్న జగన్ మాత్రం నలుగురైదుగురిపై అనుమానం పెంచుకుని వారిపై నిఘా ఉంచినట్లు తెలుస్తోంది.

ఇదే అంశం బ‌య‌ట‌కు రావ‌డంతో జ‌గ‌న్ మీడియా గొంతు నొక్కేస్తున్నారంటూ దీనిపై జాతీయ మీడియాలో సైతం పెద్ద ఎత్తున వ్య‌తిరేకంగా వార్త‌లు వ‌చ్చాయి. ఇది ప్ర‌భుత్వానికి కాస్త ఇబ్బందిగానే మారింది. ఎవ‌రో కావాల‌ని కుట్ర చేసే ఈ మ్యాట‌ర్ లీక్ చేశార‌ని అంటున్నారు. ఈ లీకు వీరుడు ఎవ‌రో గుర్తించి అత‌డిని ప‌ట్టుకోవాల‌న్న ప్లాన్‌తో జ‌గ‌న్ ఉన్న‌ట్టు స‌మాచారం. ఇలాంటి వాళ్ల‌కు వార్నింగ్‌లు ఇవ్వ‌క‌పోతే భ‌విష్య‌త్తులో మ‌రిన్ని ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని…. ఈ లీకుల‌కు ఆదిలోనే బ్రేక్ వేయాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు.

ఏపీ కేబినెట్లో లీకు వీరుడు ఎవ‌రు… జ‌గ‌న్ వేట స్టార్ట్‌…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts