మెగా ‘ఫ్యామిలీ’ రాజ‌కీయం…!

October 14, 2019 at 4:51 pm

మెగా ఫ్యామిలీ రాజ‌కీయాలు అద‌ర‌హో అనిపిస్తున్నాయ‌ని అంటున్నారు నెటిజ‌న్లు. సినిమాల‌తో ప్రారం భించిన మెగా బ్ర‌ద‌ర్స్ ప‌య‌నం .. రాజ‌కీయంగా కూడా సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ఏపీలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌వ‌ర్ స్టార్, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స‌హా మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబులు ఇద్ద‌రూ కూడా పోటీ చేయ‌డం, ఇదే స‌మ‌యంలో వైసీపీ అధినేత, ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తూ.. వ్యాఖ్య‌లు సంధించ‌డం తెలిసిందే.

ఇక‌, ఎన్నిక‌ల ఫ‌లితాల్లో జ‌న‌సేన‌కు ఆశించిన మేర‌కు మెజారిటీ రాక‌పోవ‌డం, జ‌గ‌న్ భారీ మెజారిటీతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేయ‌డం తెలిసిందే. అయితే, జ‌గ‌న్ పాల‌న‌పై మెగా బ్ర‌ద‌ర్స్ ప‌వ‌న్, నాగ‌బాబులు విమ‌ర్శ‌లు సంధిస్తూనే ఉన్నారు. ఇసుక కొర‌త స‌హా అనేక విష‌యాలపై ఈ ఇద్ద‌రూ జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, అనూహ్యంగా మెగా ఫ్యామిలీ పెద్ద‌న్న‌య్య‌, మెగా స్టార్ చిరంజీవి హ‌ఠాత్తుగా ఇప్పుడు అదే జ‌గ‌న్‌ను క‌లిసి స‌త్క‌రించ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది.

రాజ‌కీయంగా చిరు కూడా యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. గ‌తంలో కేంద్రంలో మంత్రిగా, ఇటీవ‌ల వ‌ర‌కు కూడా రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్ కీల‌క నేత‌గా ఉన్నారు. అలాంటి చిరంజీవి ఇప్పుడు ఇద్ద‌రు త‌మ్ముళ్ల అభిప్రాయాల‌కు భిన్నంగా జ‌గ‌న్‌ను స‌తీ స‌మేతంగా క‌లిసి, ఆయ‌న‌ను శాలువాతో స‌త్క‌రించ‌డం అటు సినీ, ఇటు రాజ‌కీయ వ‌ర్గాల‌ను కూడా ఆశ్చ‌ర్యానికి గురి చేసిం ది. ప్ర‌స్తుతం ఉన్న స‌మాచారం మేర‌కు ఈ నెల 2న విడుద‌లైన చిరంజీవి 151వ మూవీ సైరాను వీక్షించేం దుకు జ‌గ‌న్‌ను చిరు ఆహ్వానించిన‌ట్టు తెలుస్తోంది.

అయితే, రాజ‌కీయ వ‌ర్గాల అభిప్రాయం వేరేగా ఉన్న ట్టు తెలుస్తోంది. రాజ‌కీయ కార‌ణాలు లేకుండా చిరు వ‌స్తార‌ని చెప్ప‌లేమ‌ని అంటున్నారు. అయితే, ఇవి ఏంట‌నేది చెప్పేందుకు వారు కూడా త‌ట‌ప‌టాయిస్తున్నారు. ఏదేమైనా.. త‌మ్ముళ్లు ప‌వ‌న్‌, నాగ‌బాబులు విమ‌ర్శిస్తున్న సీఎం జ‌గ‌న్‌ను చిరు క‌ల‌వ‌డం, జ‌గ‌న్ ఇచ్చిన విందును స్వీక‌రించ‌డం వంటివి రాజ‌కీయంగా సంచ‌లనం సృష్టించాయి.

మెగా ‘ఫ్యామిలీ’ రాజ‌కీయం…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts