జ‌గ‌న్ స‌ర్కార్‌.. టార్గెట్ @ 72 అవ‌ర్స్‌

October 1, 2019 at 10:48 am

త‌న‌ను తాను తెలుసుకున్న వాడు.. ప‌క్క‌వారికి ఆద‌ర్శ‌మ‌వుతార‌ని అంటారు. ఇప్పుడు ఏపీలో పాల‌న విష యంలో జ‌గ‌న్ అనుస‌రిస్తున్న విధానాలు కూడా అదే ర‌కంగా ఉన్నాయి. రాష్ట్రంలో పాల‌న‌ను దూకుడుగా ముందుకు తీసుకు వెళ్తున్న త‌న పాల‌న‌కు కొన్ని ప‌రిధులు, ప‌ద్ధ‌తులు కూడా పెట్టుకున్నారు. త‌న పాల న‌కు ప్ర‌త్యేకంగా నిర్దేశిత ల‌క్ష్యాల‌ను కూడా నిర్ణ‌యించుకున్నారు. అవే.. ఇప్పుడు రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారుతున్నాయి. తాజాగా టార్గెట్ @72 అవ‌ర్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు జ‌గ‌న్‌. నేటి నుంచి రాష్ట్రంలో గ్రామ‌స్వ‌రాజ్యానికి జ‌గ‌న్ శ్రీకారం చుట్టారు.

బాపూజీ 150వ జ‌యంత్యుత్స‌వ స‌మ‌యంలో ఆయ‌న‌కు ఘ‌న నివాళా అన్న‌ట్టుగా జ‌గ‌న్ ప్రారంభించిన కార్య‌క్ర‌మానికి న‌లుదిశ‌ల నుంచి ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. రాష్ట్రంలో జ‌న‌రంజ‌క పాల‌నను ప్ర‌జ‌ల‌కు చేరువ చేసేందుకు జ‌గ‌న్ ప‌డుతున్న తాప‌త్ర‌యం అంతా ఇం తా కాదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న పాల‌న ప్రారంభించి నాలుగు మాసాలు కూడా పూర్తికాక‌ముందుగానే 4 ల క్ష‌ల మందికి ఉద్యోగాలు క‌ల్పించారు. ఒక సీఎం త‌లుచుకుంటే.. ఏ ప‌నైనా సాధ్య‌మేన‌ని ఆయ‌న నిరూపించారు. ఈ క్ర‌మంలోనే మ‌హాత్ముడు క‌ల‌లు గ‌న్న గ్రామ స్వ‌రాజ్యానికి పెద్ద పీట వేశారు.

రాష్ట్రంలో అడు గు పెడుతున్న వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌కు తోడు స‌చివాల‌య వ్య‌వ‌స్థ కూడా నేటి నుంచే ప్రాణం పోసుకుం టోం ది. ఈ నియామ‌కాల‌కు సంబంధించిన అప్పాయింట్‌మెంట్ లెట‌ర్ల‌ను కూడా స్వ‌యంగా అభ్య‌ర్థుల‌కు జ‌గ‌నే అందించారు. అదే స‌మ‌యంలో ఆయ‌న అభ్య‌ర్థుల‌కు అనేక దిశానిర్దేశాలు చేశారు. ప్ర‌ధానంగా రాష్ట్రంలోని 32 ప్ర‌భుత్వ శాఖ‌ల‌కు సంబంధించిన 500 సేవ‌ల‌ను అర్హులైన ప్ర‌జ‌ల‌కు నేరుగా అందించే బాధ్య‌త వీరిదేనని స్ప‌ష్టం చేశారు. అంతేకాదు, ఉద్యోగాన్ని ఉద్య‌మంగా భావించాల‌న్నారు.

ప్ర‌తి ఒక్క‌రూ బాధ్య‌త గా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచిస్తూనే.. త‌న పాల‌న‌లో ఏ ప‌నైనా అనుకున్న స‌మ‌యానికి అనుకున్న‌ట్టు పూర్తి కావాల్సిందేన‌నే స్ప‌ష్ట‌మైన సంకేతాన్ని పంపారు. అదే 72 గంట‌ల గ‌డువు! ప్ర‌తి ప‌నికీ నిర్దిష్ట గ‌డువు విధించుకుని పూర్తి చేయ‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో ఆనందం నింపాల‌న్న‌దే జ‌గ‌న్ ఉద్దేశం. ఈ క్ర‌మంలోనే ఆయ‌న టార్గెట్ 72 అవ‌ర్స్‌ను ఎంచుకున్నారు. ఈ ఒక్క ల‌క్ష్యం క‌నుక స‌క్సెస్ అయితే.. జ‌గ‌న్ కు ఇక తిరుగే ఉండ‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

జ‌గ‌న్ స‌ర్కార్‌.. టార్గెట్ @ 72 అవ‌ర్స్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts