జ‌గ‌న్ అక్కడ రిపేర్ చేయ‌ల్సిందే..!

October 7, 2019 at 11:58 am

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి అరెస్టు నెల్లూరు జిల్లా వైసీపీలో పెద్ద కుదుపు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయ‌న్ను అరెస్టు చేయ‌డంతో ఆ ప్ర‌భావం, చ‌ర్చ‌లు రాష్ట్ర రాజ‌కీయాల్లో కూడా హైలెట్ అయ్యాయి. మ‌హిళా ఎంపీడీవో పెట్టిన కేసులో ఏ 1గా ఉన్న ఆయ‌న అరెస్టు అయ్యి విడుద‌ల‌య్యాక చేసిన వ్యాఖ్య‌లు సొంత పార్టీలోనే తీవ్ర‌మైన క‌ల‌క‌లం రేపాయి.

సొంత పార్టీలోనే తనకు శత్రువులున్నారంటూ, వారిని ఓ కంట కనిపెట్టాలంటూ జగన్ కి ఆయన సూచించడం చర్చనీయాంశమైంది. అస‌లు శ్రీధ‌ర్‌రెడ్డిని ఎవ‌రు ? టార్గెట్ చేశారు ? సొంత పార్టీలోనే ఆయ‌న‌కు ఉన్న శ‌త్రువులు ? ఎవ‌రు ? అన్న ప్ర‌శ్న‌లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. విద్యార్థి రాజ‌కీయాల‌తో గుర్తింపు పొందిన కోటంరెడ్డి వైసీపీ ఏర్పాట‌య్యాక జ‌గ‌న్‌కు అత్యంత న‌మ్మ‌క‌స్తుడిగా మారారు.

2014 ఎన్నిక‌ల్లోనే ఆయ‌న‌కు కొంద‌రు సీటు ఇవ్వ‌వ‌ద్ద‌ని చెప్పినా జ‌గ‌న్ ఇవ్వ‌డం ఆయ‌న గెల‌వ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. 2019లోనూ అదే సీన్ రిపీటైంది. అయితే వైరి వర్గం మాత్రం కోటంరెడ్డిని టార్గెట్ చేయడం ఆపలేదు. అప్ప‌టి వ‌ర‌కు టీడీపీ త‌ర‌పున నెల్లూరు రూర‌ల్‌లో కోటంరెడ్డికి ప్ర‌త్య‌ర్థిగా ఉన్న ఆదాల ప్ర‌భాక‌ర్‌రెడ్డి వైసీపీలోకి వ‌చ్చి ఎంపీ అయ్యారు. ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి ఆదాల, తన పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ ఆర్థిక సాయం చేసి, కోటంరెడ్డిని మాత్రం వదిలేశారు.

ఇక జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు, స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డి పేరు సైతం ఈ విష‌యంలో కోటంరెడ్డి ప్ర‌స్తావించ‌డంతో ఇప్పుడు నెల్లూరు వైసీపీ ఎటు వైపు వెళుతుందో ? ఎవ్వ‌రికి అర్థం కాని ప‌రిస్థితి. సర్వేపల్లి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాలు ఒకదానికొకటి సరిహద్దులుగా ఉంటాయి. వాస్త‌వానికి ఇది చిన్న లేవుట్ ఇష్యూ అన్న‌ట్టుగా పైకి కనిపిస్తున్నా దీని వెన‌క ఒక‌రికి ఒక‌రికి మ‌ధ్య పొస‌గ‌క పోవ‌డం లేద‌న్న‌ది వాస్త‌వం.

మ‌ధ్య‌లో కోటంరెడ్డి వైరం వ‌ర్గం ఆయ‌న‌పై ఎంపీ ఆదాల ద్వారా జ‌గ‌న్‌పై కంప్లైంట్ చేయించింది. అయితే జ‌గ‌న్ మాత్రం కోటంరెడ్డి గురించి నాకు చెప్ప‌క్క‌ర్లేదు.. మీరు మీ ప‌ని చూసుకోండ‌ని చెప్ప‌డంతో ఆయ‌న వైరి వ‌ర్గం అంతా కోటంరెడ్డిని ఏం చేయ‌లేం ? అన్న నిర్ణ‌యానికి వ‌చ్చేసింది. ఇక ఎప్పుడైనా త‌మ‌కు మంత్రి ప‌ద‌వికి పోటీ వ‌స్తార‌ని భావిస్తోన్న కొంద‌రు నేత‌లు కూడా ఆయ‌న్ను టార్గెట్ చేయ‌డంతో ఇప్పుడు ఆయ‌న అరెస్టు వ‌ర‌కు వెళ్లింది. జ‌గ‌న్ నెల్లూరు జిల్లా గ్రూపు రాజ‌కీయాల‌పై కాన్‌సంట్రేష‌న్ చేయ‌క‌పోతే కంచుకోట కూల‌డం ఖాయం.

జ‌గ‌న్ అక్కడ రిపేర్ చేయ‌ల్సిందే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts