ఏపీ సీఎం మ‌రో కీల‌క నిర్ణ‌యం…!

October 9, 2019 at 5:46 pm

ఏపీ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఏపీలో ప్ర‌భుత్వంలోకి వ‌చ్చిన వైసీపీ ప్ర‌జా రంజ‌క పాల‌న చేస్తూ ప్ర‌జ‌ల అద‌రాభిమానాల‌ను చూరగొంటూ ముందుకు సాగుతుంది. అయితే ఇప్ప‌టికే ఏపీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ ఎవ‌రికి అంద‌నంత ఎత్తులో నిలిచే ప్ర‌య‌త్నం చేస్తున్నారా అనేలా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ఓవైపు ప‌రిపాల‌నను గాడిలో పెడుతూనే మ‌రోవైపు కీల‌క నిర్ణ‌యాల‌ను తీసుకుంటున్నారు. ఇంకో వైపు స‌మీక్ష‌ల పేరుతో అవినీతి అంతానికి న‌డుం భిగించి, మ‌రోవైపు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటూ అంద‌రిని ఆశ్చ‌ర్య ప‌రుస్తున్నారు. ఇప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుని ఔరా అనిపించారు.

ఎంతో కాలంగా బోయ కుల‌స్తుల డిమాండ్‌ను నెర‌వేర్చి వారి పాలిట దైవంగా మారారు. ఇప్పుడు జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో బోయ‌కుల‌స్తులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్పుడు తీసుకున్న నిర్ణ‌యం ఏంటంటే.. వాల్మీకి జయంతిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పండుగగా నిర్వహించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు ప్రతి ఏటా ఆశ్వయుజ పౌర్ణమి రోజు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 13న వాల్మీకి జయంతోత్సవాలు ప్రభుత్వం నిర్వహించనుంది. వాల్మీకి జయంతి కోసం రూ. 25లక్షల ప్రత్యేక నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.

అయితే 2017లోనే తెలంగాణ ప్రభుత్వం వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. అయితే తాజాగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల బోయిలు కూడా తమ సంతోషాన్ని తెలియచేస్తున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇప్పుడు వాల్మీకి జ‌యంతిని రాష్ట్ర‌పండుగ గా ప్ర‌క‌టించి బోయ కుల‌స్తులు, వాల్మీకి ని అభిమానించే ప్ర‌తిఒక్క‌రు జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని హ‌ర్షిస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు సీఎం జ‌గ‌న్ తీసుకున్న ఈ నిర్ణ‌యంతో బోయ‌కుల‌స్తుల్లో ఎక్క‌డ లేని ఆనందం తాండ‌విస్తుంది.

ఏపీ సీఎం మ‌రో కీల‌క నిర్ణ‌యం…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts