వైసీపీ ఎంపీ పెళ్లి ఫిక్స‌య్యింది…

October 5, 2019 at 11:48 am

అరకు వైసీపీ ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం ఈనెల 17న జరగనుంది. గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్‌తో ఆమెకు నిశ్చితార్థం జరిగిందని ఎంపీ సోదరులు మహేశ్, ప్రసాద్‌ తెలిపారు. తెల్లవారుజాము 3.15 గంటలకు శరభన్నపాలెంలో వివాహం, విశాఖలో రిసెప్షన్‌ నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు వైసీపీ అగ్రనేతలు వస్తారని తెలిపారు.

చింత‌ప‌ల్లి మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేముడు కుమార్తె అయిన మాధ‌వి పాయ‌క‌రావుపేట కాలేజ్‌లో పీఈటీగా ప‌నిచేశారు. ఈ క్ర‌మంలోనే వైఎస్ జ‌గ‌న్ విధానాల ప‌ట్ల ఆక‌ర్షితులు అయిన ఆమె పార్టీలో చేరిపోయారు.
కాగా 2019 సాధారణ ఎన్నికల్లో అరకు ఎంపీగా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ పై మాధవి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

గొడ్డేటి మాధవి లోక్‌సభ చరిత్రలోనే అతి పిన్న వయస్కురాలు. కేవలం 25 ఏళ్ల మూడు నెలలకే ఎంపీగా ఆమె ఎన్నికయ్యారు. బీఎస్సీ బీఈడీ చ‌దివారు. ఇక ఆమెకు కాబోయే భ‌ర్త శివప్రసాద్… ఎస్‌టీ థెరిసా విద్యా సంస్థల కరస్పాండెంట్‌గా, శివ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌గా ఉన్నారు.

వైసీపీ ఎంపీ పెళ్లి ఫిక్స‌య్యింది…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts