వైసీపీ ఎంపీ సంచ‌ల‌నం: త‌ల న‌ర‌కండి

October 14, 2019 at 12:41 pm

ఏపీలో వైసీపీ నేత‌లు వ‌రుస‌గా ఏదో ఒక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. నిన్న‌టికి నిన్న జ‌గ‌న్ ప‌రువును ఓ మ‌హిళా నేత తీసేశారు. ఆమె ఏ సాధార‌ణ మ‌హిళో కాదు.. మాజీ కేంద్ర మంత్రి కావ‌డం విశేషం. కృపారాణి కావాల‌ని చేయ‌క‌పోయినా ఆమె వ్యాఖ్య‌లు మాత్రం సొంత పార్టీ నేత‌ల‌కే షాక్ ఇచ్చాయి.. అదే టైంలో అవి ప్ర‌తిప‌క్షాల‌కు బ్ర‌హ్మాస్త్రాలుగా మారాయి. ఆదివారం ఆమె ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ నోరు జారారు. ఆంధ్రప్రదేశ్‌ను అవినీతి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు.

ఆమె వ్యాఖ్య‌ల‌ను విన్న కొంద‌రు స‌రిచేసే ప్ర‌య‌త్నం చేయ‌బోయినా ఆమె మాత్రం అవేం ప‌ట్టించుకోకుండా త‌న ప్ర‌సంగాన్ని కంటిన్యూ చేశారు. ఈ ప్ర‌సంగాన్ని ఎవ‌రో వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పెట్ట‌డంతో ఇప్పుడు అది బాగా వైర‌ల్ అయ్యింది. దీనిని వైసీపీ యాంటీ ఫ్యాన్స్ బాగా వైర‌ల్ చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ఇప్పుడు వైసీపీకే చెందిన తాజా ఎంపీ ఒక‌రు చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

అనంత‌పురం వైసీపీ ఎంపీ రంగ‌య్య మాట్లాడుతూ రాయలసీమలో చంపేవాడు, చచ్చేవాడు బోయలేనన్నారు. ఉసి గొల్పేవారి తల తీసేయండని వైసీపీ ఎంపీ తలారి రంగయ్య పిలుపునిచ్చారు. బోయలు బోనులో నిలబడకూడదని, న్యాయూర్తులుగా ఎదగాలని తలారి రంగయ్య పిలుపు నిచ్చారు. బోయ‌ల‌ను రెచ్చ‌గొట్టే వారి విష‌యంలో ప్ర‌తి ఒక్క‌రు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కూడా ఆయ‌న కోరారు.

కొంద‌రు బోయ‌ల‌ను రెచ్చ‌గొడుతూ వారిలో వారికే క‌ల‌హాలు సృష్టిస్తున్నార‌ని… ఉసిగొల్పేవాడి తలతీసేస్తే తాము తగవులాడుకోవాల్సిన పని ఉండదన్నారు. గాయాలపాలై డాక్టర్ల దగ్గరకు వెళ్లేకంటే మనమే డాక్టర్లుగా మారాలని తలారి రంగయ్య అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్య‌లపై ర‌క‌ర‌కాలుగా కామెంట్లు వ‌స్తున్నాయి. కొంద‌రు రంగ‌య్య చేసిన వ్యాఖ్య‌లు కొన్ని కులాల‌ను టార్గెట్ చేసిన‌ట్టుగా ఉన్నాయ‌ని అంటుంటే.. మ‌రి కొంద‌రు మాత్రం అందులో త‌ప్పేం లేదంటున్నారు.

వైసీపీ ఎంపీ సంచ‌ల‌నం: త‌ల న‌ర‌కండి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts