తెలంగాణలో త‌హ‌సీల్దార్ దారుణ హ‌త్య‌…!

November 4, 2019 at 3:50 pm

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ త‌హాసీల్ధార్ విజ‌యారెడ్డిని దుండ‌గుడు సురేష్ దారుణ హ‌త్య చేశాడు. త‌హాసీల్దార్ కార్యాల‌యంలో విధుల్లో ఉన్న విజ‌యారెడ్డి వ‌ద్ద‌కు వెళ్లిన దుండ‌గుడు సురేష్ అమెపై కిరోసిన్ పోసీ నిప్పుపెట్టాడు. దీంతో మంట‌ల్లో చిక్కున్న త‌హాసీల్దార్ అక్క‌డికక్క‌డే స‌జీవ ద‌హ‌నం అయ్యారు. ఈ సంఘ‌ట‌న మ‌ధ్యాహ్నం 1.20గంట‌ల‌కు జ‌రిగింది. హైద‌రాబాద్‌కు కూత‌వేటు దూరంలో ఉన్న ఈ అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాన్ని ఇటీవ‌లే ప్ర‌భుత్వం కొత్త‌గా త‌హాసీల్దార్ కార్యాల‌యంగా ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతం రియ‌ల్ ఎస్టెట్‌కు పెట్టింది పేరు. ఇక్క‌డ రియ‌ల్ భూమ్ పెద్ద ఎత్తున జ‌రుగుతున్న క్ర‌మంలో ఈ దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌హాసీల్దార్ కార్యాల‌యానికి నిత్యం వంద‌లాది మంది ప్ర‌జ‌లు వ‌స్తుంటారు. అయితే ఓ అగంత‌కుడు రెండు పాసుపుస్త‌కాలు ప‌ట్టుకుని త‌హాసీల్దార్ విజ‌య రూంలోకి వెళ్ళాడు. అక్క‌డ త‌హాసీల్దార్‌తో మాట్లాడుతూనే అమెపై కిరోసిన్ పోసి త‌గ‌ల‌బెట్టాడు. త‌రువాత త‌నపై కూడా పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంట‌లు అంటుకున్న త‌హాసీల్దార్ విజ‌య హ‌హాకారాలు చేస్తుండ‌టంతో సిబ్బందికి ఏమీ జ‌రుగుతుందో తెలియ‌ని ప‌రిస్థితి ఉంది. త‌హాసీల్దార్ నిప్పుల్లో కాలిపోతున్న తీరును గ‌మ‌నించిన సిబ్బంది మంట‌లు ఆర్పే ప్ర‌య‌త్నం చేయ‌బోయా మ‌రో ఇద్ద‌రు సిబ్బందికి నిప్పు అంటుకుంది. అయితే అప్ప‌టికే త‌హాసీల్దార్‌కు అంటుకున్న మంట‌లు అంత‌టా వ్యాప్తించ‌డంతో అమె అక్క‌డిక్క‌డే మృతి చెందారు. ప్ర‌స్తుతం త‌హాసీల్దార్ మృత‌దేహాన్ని గాందీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాగా దుండ‌గుడు సురేష్ పోలీసుకు లొంగిపోవ‌డంతో ఘ‌ట‌న‌కు దారి తీసిన ప‌రిస్థితుల‌ను ఆరా తీస్తున్నారు.

తెలంగాణలో త‌హ‌సీల్దార్ దారుణ హ‌త్య‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts