అల వైకుంఠ‌పురంలోకు బ‌న్నీ అన్ని కోట్లు తీసుకున్నాడా…!

November 21, 2019 at 3:46 pm

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా అల వైకుంఠపురములో. అల్లు అర్జున్ స‌ర‌స‌న పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమా వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా 2020 జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు విడుదల కాగా విడుదలైన రెండు పాటలు ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి.

బ‌న్నీ – త్రివిక్ర‌మ్ కాంబోలో జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి త‌ర్వాత వ‌స్తోన్న మూడో సినిమా కావ‌డం… ఇటు అరవింద సమేత వీర రాఘవ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఈ సినిమాపై ఉన్న అంచ‌నాల నేపథ్యంలో అల వైకుంఠపురములో థియేట్రికల్ రైట్స్ దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడయ్యాయి.

కేవ‌లం హిందీ శాటిలైట్‌, డిజిట‌ల్ రైట్స్‌కే రు. 19.5 కోట్లు చెల్లించారు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఏకంగా రు.25 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్నాడ‌ట‌. అల్లు అర్జున్ కెరీర్‌లోనే ఇది టాప్ రెమ్యున‌రేష‌న్ కావ‌డం విశేషం. పైగా ప్లాప్ సినిమా త‌ర్వాత కూడా మ‌నోడ ఈ రేంజ్‌లో రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డంతో ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు షాక్ అవుతున్నాయి.

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని సమాచారం. ఈ సినిమాకు దాదాపు 120 కోట్ల రూపాయలు బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

అల వైకుంఠ‌పురంలోకు బ‌న్నీ అన్ని కోట్లు తీసుకున్నాడా…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts