అల్లు అర్డ‌ర్‌కు అత‌డు రంగంలోకి దిగాడు..!

November 19, 2019 at 10:53 am

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు కొత్త ట్రెండ్‌ను సెట్ చేశాడు. సినిమా ప్ర‌మోష‌న్‌కు కొత్త పుంతులు తొక్కేలా కొత్త కొత్త ప్ర‌యోగాల‌కు సిద్ద‌మ‌య్యాడు. ఇలాంటి ప్ర‌యోగాలు చేసి ఇప్ప‌టికే స‌క్సెస్ బాట ప‌ట్టిన అల్లు అర్జున్ తాను న‌టించ‌బోతున్న మ‌రో సినిమాకు ఇదే ఫార్మూలాను ఫాలో కాబోతున్నాడు. అందుకే అల్లు ఆ ద‌ర్శ‌కుడికి అర్డ‌ర్ వేయ‌డంతో వెంట‌నే రంగంలోకి దిగి పని షురూ చేసిన‌ట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది.

అల్లు అర్జున్ అల్టీమేట‌మ్ జారీ చేయ‌డం అంటే అది ఎంత సీరియ‌స్‌గా ఉంటుందో ఇప్పుడు ఆయ‌న వేస్తున్న ఆర్డ‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. ఇంత‌కు అల్లు అర్జున్ ఏ ద‌ర్శ‌కుడికి ఆర్డ‌ర్ వేశాడు. ప‌నిలోకి దిగిన ఆ ద‌ర్శ‌కుడు ఎవ్వ‌రు.. ఏమా ప‌ని అనుకుంటున్నారా.. అల్లు అర్జున్ న‌టిస్తున్న చిత్రం అలా వైకుంఠ‌పురములో.. ఈ సినిమా సంక్రాంతికి విడుద‌ల కానున్న‌ది. అయితే సినిమా విడుద‌ల కావ‌డానికి ఇంకా రెండు నెల‌ల టైం ఉంది. అయితే బ‌న్నీ త‌న‌దైన శైలీలో చిత్ర ప్ర‌మోష‌న్‌కు శ్రీ‌కారం చుట్టారు.

అలా వైకుంఠ‌పురములో చిత్ర ప్ర‌మోష‌న్ కోసం ముందుగానే సినిమాలోని పాట‌ల‌ను విడుద‌ల చేశారు. ఈ పాట‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ పాట‌ల‌తో సినిమాకు భారీ హైప్ క్రియోట్ కావడంతో పాటుగా, ఎప్పుడు సినిమా విడుద‌ల అవుతుందా అనే ఉత్కంఠ నెల‌కొంది అభిమానుల్లో. ఇది అల్లుకు బాగా న‌చ్చింది. తాను తీసుకున్న నిర్ణ‌యంతో సినిమాకు క‌లిసొస్తుండటం ప‌ట్ల ఆనందం వ్య‌క్తం చేస్తున్న బ‌న్నీ మ‌రో సినిమాకు ఇదే ఫార్మూలాను ఫాలో కాబోతున్నాడు.

అల వైకుంఠ‌పుర‌ములో సినిమా పూర్తి కాగానే ప్రముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బన్నీ ఓ ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌బోతున్న చిత్రంలో న‌టించ‌బోతున్నారు. ఈ సినిమా కు సంబంధించిన ఫ్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను ముమ్మ‌రంగా చేస్తున్నారు ద‌ర్శ‌కుడు సుకుమార్‌. అయితే త్వ‌రలో సినిమా సెట్స్ మీద‌కు రాబోతున్న త‌రుణంలో చిత్ర సంగీత ద‌ర్శ‌కుడు దేవి శ్రీ ప్ర‌సాద్‌ను ముందుగానే పాటలు, ట్యూన్స్ ఇవ్వాల‌ని అల్లు ఆదేశించార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ముందుగా పాట‌ల‌ను విడుదల చేయ‌డం వ‌ల‌న సినిమాకు భారీ హైప్ రావ‌డంతో పాటుగా ముమ్మ‌రంగా ప్ర‌చారం జ‌రుగుతుంది అని బన్నీ భావ‌న. అల్లు ఆర్డ‌ర్‌తో దేవి శ్రీ ప్ర‌సాద్ రంగంలోకి దిగి త‌న ప‌నిని ప్రారంభించార‌ని స‌మాచారం. ఏదేమైనా బ‌న్నీ చిత్ర ప్ర‌మోష‌న్ల‌ను ఇలా ముందుగానే ప్రారంభించేందుకు కొత్త ట్రెండ్‌ను సృష్టించ‌డంతో అంద‌రు అదే ఫాలో అయ్యే అవకాశం లేక‌పోలేదు.

అల్లు అర్డ‌ర్‌కు అత‌డు రంగంలోకి దిగాడు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts