బ‌న్నీ కొత్త రూల్‌తో నిర్మాత‌ల గ‌గ్గోలు…?

November 9, 2019 at 1:22 pm

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ (బ‌న్నీ) నాపేరు సూర్య దెబ్బ‌తో ఆచితూచి లాంగ్ గ్యాప్ తీసుకుని మ‌రి సినిమాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్‌తో అల వైకుంఠ‌పురంలో సినిమా చేస్తోన్న బ‌న్నీ ఈ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే సుకుమార్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కే సినిమాలో న‌టించ‌నున్నాడు. నాపేరు సూర్య దెబ్బ‌తో పెద్ద డైరెక్ట‌ర్ల‌కు మాత్ర‌మే ఓకే చెపుతున్నాడు. ఎక్క‌డా చిన్న చిన్న త‌ప్పులు చేసేందుకు కూడా బ‌న్నీ ఎంత మాత్రం సిద్ధంగా లేన‌ట్టే కన‌ప‌డుతోంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు బ‌న్నీ పెడుతోన్న కొత్త రూల్స్‌తో తెలుగు నిర్మాత‌ల‌కు చుక్క‌లు క‌న‌ప‌డుతున్న‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల భోగ‌ట్టా. బ‌న్నీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికి సినిమా చేసినా త‌న రెమ్యున‌రేష‌న్ మాత్ర‌మే తీసుకునేవాడు. అయితే ఇప్పుడు ప్ర‌తి సినిమాకు గీతా ఆర్ట్స్‌కి వాటా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాడ‌ట‌. అందుకే ఓకే చెపితేనే సినిమా లేకుంటే లేద‌న్న‌ట్టే ఖ‌రాఖండీగా చెప్పేస్తున్నాడ‌ట‌.

ఇక త్రివిక్ర‌మ్ ఉండ‌డంతో హారిక వాళ్లు ఈ విష‌యాన్ని రాద్దాంతం చేయ‌లేదు. ఇక ఇప్పుడు మైత్రీ వాళ్ల ముందు కూడా అదే డిమాండ్ పెట్ట‌డంతో వాళ్లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్న‌ట్టు టాక్‌. అస‌లే వ‌రుస ప్లాపుల‌తో ఉన్న ఆ బ్యాన‌ర్ ఇప్పుడు బ‌న్నీ కండీష‌న్‌కు ఒప్పుకుంటే ఓ పెద్ద సినిమాకు వ‌చ్చే ప్రాఫిట్లో గీతా వాళ్ల‌కు షేరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది.

అలా అయితే ఎంతో రిస్క్ చేసి సినిమా తీసిన మైత్రీ వాళ్ల‌కు మిగిలేది ఏం ఉండ‌దు. పైగా ఆ బ్యాన‌ర్‌ చాలా రోజుల త‌ర్వాత పెద్ద హీరో సినిమా చేస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో వాళ్లు బ‌న్నీకి ఏం చెపుతారో ? అన్న‌ది స‌స్పెన్స్‌గా ఉంది. బ‌న్నీ పెట్టిన ఈ కొత్త రూల్‌తో ఇప్పుడు ఇండ‌స్ట్రీలో చాలా మంది నిర్మాత‌లు సైతం డైల‌మాలో ఉన్నార‌ట‌.

బ‌న్నీ కొత్త రూల్‌తో నిర్మాత‌ల గ‌గ్గోలు…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts