ఆమంచికి ద‌గ్గుబాటి గ‌తే ప‌డుతుందా..!

November 7, 2019 at 1:16 pm

పార్టీని అప్ర‌తిష్ట‌పాలు చేసినా.. స్వలాభాల కోసం ప‌రుగులు పెట్టినా వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ తోక‌లు క‌త్తిరిస్తున్నారు. ఈనేప‌థ్యంలో ప్రకాశం జిల్లా ప‌రుచూరు నుంచి వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిన దగ్గుబాటి వెంక‌టేశ్వరావుకు ఈ మ‌ధ్య గ‌ట్టి వార్నింగే ఇచ్చారు. అధికార పార్టీపైనా, సీఎం జ‌గ‌న్‌పైనా దగ్గుబాటి వెం క‌టేశ్వర‌రావు భార్య, మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి విమ‌ర్శలు చేయ‌డంపై జ‌గ‌న్ సీరియ‌స్ అయ్యారు. ఉంటే అంతా వైసీపీలోనూ, లేదంటే మీ ఇష్టమొచ్చిన పార్టీలో ఉండాల‌ని ఆదేశించారు.

మొత్తానికి ద‌గ్గుపాటికి పొమ్మన‌కుండా పొగ పెట్టే ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని, చివ‌ర‌కు ద‌గ్గుబాటి త నంత‌ట తానుగా పార్టీని వీడి వెళ్లి బ‌య‌ట‌కు వెళ్లేలా ప‌రిస్థితుల‌ను క‌ల్పిస్తున్నార‌ని ప్ర‌చారం జ రుగుతోం ది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే జిల్లా చీరాల నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ నాయ‌కుడు ఆమంచి కృష్ణ మోహ‌న్ ప‌రిస్థితి కూడా ఇలానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆమంచి వైఖ‌రిపై ఆగ్ర‌హంతో ఉన్న జ‌గ‌న్ ఆయ‌న్ను కూడా దుగ్గుబాటిలాగే పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం.

గ‌తంలో కాంగ్రెస్ త‌ర‌ఫున గెలిచిన ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌ త‌ర్వాత రాష్ట్ర విభ‌జ‌న‌తో ఒంట‌రిగా పోటీ చేసి విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత చంద్రబాబు పిలుపు మేర‌కు టీడీపీలోకి వ‌చ్చినా.. అంటీ ముట్టన‌ట్టు వ్యవ‌హ‌రించారు. ఇక‌, ఎన్నిక‌ల‌కు ముందు ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల జ‌రిగిన ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్ సునామీ క‌నిపించినా… చీరాల‌లో ఆమంచి కృష్ణమోహన్ మాత్రం ఓట‌మి పాల‌య్యారు. ఆమంచిపై టీడీపీ అభ్యర్థి క‌ర‌ణం బ‌లారం ఏకంగా 17 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు.

తాను ఓడినా.. త‌మ పార్టీ అధికారంలో ఉంద‌ని ఆమంచి, ఆయ‌న సోద‌రుడు, ఆయ‌న కుమారుడు నియో జ‌క‌వ‌ర్గంలో ఇష్టారాజ్యంగా చెల‌రేగిపోవ‌డంతో జ‌గ‌న్ వీరిని హెచ్చరించారు. అయిన‌ప్పటికీ ఆమంచి కృష్ణ మోహన్ లో మార్పు రాక‌పోవ‌డంత, ఆయ‌న వ‌ర్గం ఎక్కడా త‌గ్గక‌పోవ‌డంతో జ‌గ‌న్ సీరియ‌స్‌గా తీ సుకున్నారు. ఆమంచికి త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు పంపాల‌ని జ‌గ‌న్ అనుకుంటున్నట్టు ప్రచారం సాగుతోంది. ఆమంచి దూకుడుకు చెక్ పెట్టేందుకు ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు వైసీపీలోనే ఉన్న యెడం బాలాజీని తిరిగి వైసీపీలోకి తీసుకు వ‌చ్చే ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌.

ఆమంచికి ద‌గ్గుబాటి గ‌తే ప‌డుతుందా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts