అమ‌రావ‌తి నుంచి క‌ర్నూలు దిశ‌గా ఏపీ రాజ‌ధాని …?

November 19, 2019 at 11:19 am

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఏపీ రాజ‌ధానిపై పెద్ద స‌స్పెన్స్ నెల‌కొంది. రాజ‌ధాని అమ‌రావ‌తి నుంచి త‌ర‌లిపోతుందంటూ వార్త‌లు గుప్పుమంటున్నాయి. ఇక సీనియ‌ర్ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చేస్తోన్న వ్యాఖ్య‌లు సైతం రాజ‌ధానిపై పెద్ద గంర‌ద‌గోళాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇక నాడు రాజ‌ధానిని అమ‌రావ‌తిగా ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కోట్ల రూపాయ‌ల‌తో శంకుస్థాప‌న‌లు చేసి డిజైన్ల‌తోనే స‌రిపెట్టేశారు.

రాజ‌ధానిపై నాటి ప్ర‌భుత్వం వేల ఎక‌రాలు సేక‌రించింది. ఈ భూముల విష‌యంలో పెద్ద గోల్ మాల్ జ‌రిగిన‌ట్టు కూడా అనేక సందేహాలు త‌లెత్తాయి. ఈ అంశాల్ని తేల్చేందుకు జీఎన్ రావు నేతృత్వంలో నిపుణల కమిటీని ఏర్పాటు చేయటం తెలిసిందే. ఈ కమిటీ చేసిన సూచ‌న‌ల‌ను బ‌ట్టే రాజ‌ధాని ఏర్పాటు ఉంటుంద‌ని వైసీపీ ప్రభుత్వం సంకేతాలు వెలువ‌డేలా చేస్తోంది.

ఈ క్ర‌మంలోనే జీఎన్ రావు క‌మిటీ ప్రజల అభిప్రాయం తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఈ క‌మిటీ క‌ర్నూలులో ప‌ర్య‌టిస్తోంది. ఈ క్ర‌మంలోనే కర్నూలు పట్టణానికి దగ్గర్లోని ఓర్వకల్లు ఎయిర్ పోర్టు దగ్గర భూములు సిద్ధం చేయాలని అధికారులకు చేసిన సూచన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది హైకోర్టు ఏర్పాటు కోస‌మే అన్న చ‌ర్చ కూడా క‌ర్నూలు జిల్లాలో జోరుగా చ‌ర్చ‌లు వినిపిస్తున్నాయి.

ఇక జీఎన్ రావు కమిటీతో కర్నూలు కలెక్టర్.. ఎస్పీలు సమావేశమయ్యారు. ఈ క్ర‌మంలోనే క‌ర్నూలు సిటీతో పాటు క‌ర్నూలుకు క‌నెక్టివిటీతో ఉన్న రోడ్డు, రైలు మార్గాల‌ను ఆధునీక‌రించేలా ఆదేశాలు జారీ చేసిన‌ట్టు తెలుస్తోంది. అలాగే మెడిటెక్ సిటీ ప్రాజెక్టు మంజూరు చేయాలని కర్నూలు కలెక్టర్ కోరినట్లుగా తెలుస్తోంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో క‌ర్నూలుకు హైకోర్టు త‌రలిపోతే రాజ‌ధానిలో మిగిలిన నిర్మాణాలు కూడా అమ‌రావ‌తిలో ఉండ‌డం క‌ష్ట‌మే అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.

అమ‌రావ‌తి నుంచి క‌ర్నూలు దిశ‌గా ఏపీ రాజ‌ధాని …?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts