ఆ సినిమాకు అనుష్క నో…!

November 16, 2019 at 12:31 pm

అందంలో, న‌ట‌న‌లో అమెకు తిరుగులేదు. హీరోల‌తో రొమాన్స్ చేయాల‌న్నా… రౌడీల‌తో ఫైటింగ్ చేయాల‌న్నా… మ‌ల్ల‌యుద్ధంలో క‌త్తి తిప్పాల‌న్నా… అమెకు టాలీవుడ్‌లో ఇప్పుడు ఎదురు లేని భామ‌. సైజ్ జీరో సినిమాలో న‌టించాల‌న్నా.. చారిత్ర‌క నేప‌థ్యాల‌తో తెర‌కెక్కె చిత్రాల్లో న‌టించాల‌న్నా అందరికి ఈ అందాల సుంద‌రే కావాలి. అయితే ఇప్పుడు ఈ అందాల భామ ఆ సినిమాల్లో ఎట్టిప‌రిస్థితుల్లోనూ న‌టించ‌న‌ని అంటుంది.

ఆ సినిమాల్లో న‌టించి న‌టించి బోర్ కొట్టిన‌ట్లుంది.. అందుకే ఇక‌ముందు ఆ సినిమాల్లో నటించ‌లేను అంటూ తేల్చిచెప్పింద‌నే టాక్ ఇప్పుడు టాలీవుడ్‌లో జోరుగా వినిపిస్తుంది. ఇంతకు ఆ సినిమాల్లో న‌టించ‌ను అంటున్న తార ఎవ్వ‌రు అనుకుంటున్నారా..? అమె అందాల న‌టీ అనుష్క శెట్టి. అమె న‌టించ‌ను అంటున్న చిత్రాలు ఏమై ఉంటాయి అనుకుంటున్నారా..? అదేనండీ.. చారిత్ర‌క నేప‌థ్యంలో తెర‌కెక్కె చిత్రాల్లో ఇక‌ముందు న‌టించ‌నంటుంది.

అనుష్క ఇప్ప‌టి వ‌ర‌కు రొమాన్స్, జాన‌ప‌ద‌, చారిత్ర‌క సినిమాల్లో న‌టించింది. అయితే ఇక‌ముందు రొమాన్స్ సినిమాకే ప్రాధాన్య‌త ఇస్తాన‌ని అంటుంది. జాన‌ప‌ద, చారిత్ర‌క చిత్రాల్లో న‌టించేది లేద‌ని అంటుంది. ఇంత‌కు ముందు అనుష్క బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి, సైరా న‌రిసింహారెడ్డి చిత్రాల్లో న‌టించింది. ఇప్పుడు మ‌ణిర‌త్నం తీయ‌బోతున్న పొన్నియ‌న్ సెల్వ‌న్ చిత్రంలోనూ న‌టిస్తుంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. అయితే తాను అందులోనే కాదు భ‌విష్య‌త్‌లోనూ ఇలాంటి చిత్రాల్లోనూ న‌టించ‌బోన్న తేల్చి చెప్పేసింద‌ని టాక్‌.

ఆ సినిమాకు అనుష్క నో…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts