బ్రేకింగ్‌: షియావ‌క్ఫ్, నిర్మోహీ అఖాడా ఫిటిష‌న్ కొట్టేసిన ధ‌ర్మాస‌నం

November 9, 2019 at 10:59 am

దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపబోయే కీలక అయోధ్య భూవివాదం కేసులో అత్యున్నత న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించనుంది. దీంతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక అయోధ్య తీర్పును ఐదుగురు న్యాయ‌మూర్తులు చ‌ద‌వ‌డం కూడా స్టార్ట్ చేశారు. కోర్టు హాల్ నెంబ‌ర్ 1లో ఈ ఐదుగురు న్యాయమూర్తులు స‌మావేశ‌మ‌య్యారు. ఇక తాజా తీర్పులో భాగంగా షియా, అఖాడా వాద‌న‌ల‌ను సైతం ధ‌ర్మాస‌నం తోసిపుచ్చింది.

ఇక తీర్పు సంద‌ర్భంగా అయోధ్య, యూపీలోని కీలక ప్రాంతాల్లో భారీగా పారామిలటరీ దళాలను మోహరించారు. ఆయోధ్య పరిసర ప్రాంతాల్లో దాదాపు 20 వేల మందిని భద్రతకు నియమించారు ముందు జాగ్రత్త చర్యగా ఉత్తరప్రదేశ్ సహా ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లో విద్యాసంస్థలకు సోమవారం వరకు సెలవులు ప్రకటించగా, రాజస్థాన్, కర్ణాటక, జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వాలు కూడా పాఠశాలలకు శనివారం సెలవులు ప్రకటించాయి.

బ్రేకింగ్‌: షియావ‌క్ఫ్, నిర్మోహీ అఖాడా ఫిటిష‌న్ కొట్టేసిన ధ‌ర్మాస‌నం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts