అయోధ్య తీర్పుకు సుప్రీంకు ఆధారాలు ఇవే

November 9, 2019 at 12:58 pm

భార‌త‌దేశంలో దాదాపు ఏడు ద‌శాబ్దాలుగా అటు ప్ర‌భుత్వాల‌కు, ఇటు ప్ర‌జ‌ల‌కు ఎంతో ఇబ్బందిగాను, మ‌తాల మ‌ధ్య సున్నిత‌మైన అంశంగాను ఉన్న అయోధ్య తీర్పును సుప్రీం ఎట్ట‌కేల‌కు శ‌నివారం వెల్ల‌డించింది. గతంలో అల‌హాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చుతూ వివాస్పద 2.77 ఎక‌రాల స్థ‌లం రామ‌జ‌న్మ న్యాస్‌కే అప్ప‌గిస్తూ త‌న తీర్పు వెలువ‌రించింది. దీంతో అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది.

అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయోధ్య యాక్ట్‌ కింద మందిర నిర్మాణానికి మూడు నెలల్లోగా ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఐదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం ఏకాభిప్రాయంతో తీర్పు వెలువ‌రించ‌డంతో దీనిపై రివ్యూ ఫిటిష‌న్‌కు కూడా ఛాన్స్ లేదంటున్నారు.

ఇక అయోధ్య తీర్పును పురావ‌స్తు శాఖ ఆధారాల ప్ర‌కార‌మే ఇచ్చిన‌ట్టు కూడా ధ‌ర్మాస‌నం స‌భ్యులు స్ప‌ష్టం చేశారు. పురావస్తు పరిశోధనల ప్రకారం చూస్తే 12 శతాబ్దంలోనే అక్కడ ప్రార్థనా స్థలం ఉందని ఆయన అన్నారు. అయితే అది ఆలయం అని చెప్పడానికి ఆధారాలు లేవని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ చెప్పారు.

పురావస్తు పరిశోధనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అన్నారు. అక్కడి నిర్మాణం ఇస్లాం సంప్రదాయానికి అనుకూలంగా లేదని పురావస్తు శాఖ నివేదిక ఇచ్చిందని ఆయన అన్నారు. ఇక పురావ‌స్తు శాఖ కోర్టుకు స‌మ‌ర్పించిన ఆధారాల‌ను బేస్ చేసుకునే కోర్టు త‌న తీర్పు వెలువ‌రించింది.
వివాదాస్పద భూభాగాన్ని అలహాబాద్ హైకోర్టు విభజించడం ఆమోదయోగ్యం కాదని సుప్రీం స్పష్టం చేసింది.

అయోధ్య తీర్పుకు సుప్రీంకు ఆధారాలు ఇవే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts