అయోధ్య “రాముడిదే” సుప్రీమ్ చారిత్రాత్మక తీర్పు

November 9, 2019 at 11:19 am

అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఈ రోజు వెలువరింది. దేశ వ్యాప్తంగా ఈ తీర్పు నేప‌థ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీ విరమణకు ముందు రోజు తీర్పు వెలువడుతుందని అంతా భావించారు. ఇక ఇక్క‌డ ప్ర‌తి శుక్ర‌వారం ముస్లింలు న‌మాజ్ చేసేవార‌ని.. ఇందుకు ఆధారాలు ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేసిన కోర్టు అల‌హాబాద్ హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది.

ఇక ముస్లింల మ‌సీద్ నిర్మాణానికి ప్ర‌త్యేక స్థ‌లం కేటాయించాల‌ని కూడా తీర్పు ఇచ్చింది. అక్క‌డ గుడి నిర్మాణానికి కూడా కేంద్ర ప్ర‌భుత్వం ఒక ట్ర‌స్ట్ ఏర్పాటు చేసి మ‌రీ అక్క‌డ రామ‌మందిరం నిర్మించాల‌ని .. అయోధ్య‌లోనే సున్నీ వ‌క్ఫ్ బోర్డుకు మ‌సీదు నిర్మాణానికి ఐదు ఎక‌రాల స్థ‌లం కేటాయించాల‌ని తెలిపింది. ఇక రామ‌మందిర నిర్మాణానికి కేంద్రం మూడు సంవ‌త్స‌రాల లోపు ఏర్పాటు చేయాలి. ఆ ట్ర‌స్ట్ నిర్మాణంలోనే ఈ గుడి నిర్మాణం జ‌ర‌గాల‌ని చెప్పింది.

ఇక వివాస్పద ప్రాంతం మొత్తం కేంద్ర ప్ర‌భుత్వ ఆధీనంలోనే ఉండాల‌ని తెలిపింది. ఇక ఈ రోజు వెలువ‌డిన తీర్పులో ఐదుగురు న్యాయ‌మూర్తులు కూడా యునానిమ‌స్‌గా ఒకే విధ‌మైన తీర్పు ఇచ్చారు. షియావ‌క్ఫ్ బోర్డు దాఖ‌లు చేసిన ఫిటిష‌న్‌ను అత్యున్న‌త న్యాయ‌స్థానం తోసిపుచ్చింది. చీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియా రంజ‌న్ గొగాయ్ ఈ తీర్పు చ‌దివి వినిపించారు.

అయోధ్య భూ వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యంలో యూపీలోని మధుర పోలీసులు సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లపై దృష్టి సారించారు. అదేవిధంగా 5 వేల మంది డిజిటల్ వాలంటీర్లు రంగంలోకి దిగారు. దీనికితోడు మధురలో పోలీసు బలగాలను మోహరించారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను పట్టించుకోవద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.

అయోధ్య “రాముడిదే” సుప్రీమ్ చారిత్రాత్మక తీర్పు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts