బ్రేకింగ్‌: బాబ‌ర్ ఈ మ‌సీదు నిర్మించ‌లేదు…

November 9, 2019 at 11:06 am

వివాదాస్పద అయోధ్య కేసులో సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెల్లడిస్తోంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ తీర్పును చదివివినిపించారు. ఐదుగురు న్యాయమూర్తుల ఏకాభిప్రాయంతో ప్రధాన న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. ఈ తీర్పు తొలి ఘ‌ట్టంలో భాగంగా వివాదాస్పద స్ధలం 2.77 ఎక‌రాల స్థ‌లం తమదేనంటూ షియా బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.

నిర్మోహి అఖాడా దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం తోసిపుచ్చింది. తీర్పుపై ఐదుగురు న్యాయమూర్తులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. చరిత్ర, మతపరమైన, న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పు వెలువరించినట్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఖాళీ ప్రదేశంలో బాబ్రీ మసీదు నిర్మించలేదని పేర్కొన్నారు. అన్నింటికి మించి మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి బాబ‌ర్ ఈ మసీదు నిర్మించార‌న‌డంలో ఎలాంటి ఆధారాలు లేవ‌ని కూడా చెప్పింది.

బాబ‌ర్ ద‌గ్గ‌ర ప‌నిచేసిన సైనికాధాకారులే ఈ మ‌సీదు నిర్మించార‌ని కూడా తెలిపింది. ఇక ఈ మసీదును నిర్మించార‌న‌డంలో ఎలాంటి తేదీ లేద‌ని కూడా ధ‌ర్మాసనం స్ప‌ష్టం చేసింది. ఇక ఈ స్థ‌లంలో హిందువులు ముందు నుంచి పూజ‌లు చేసేవార‌న్న ఆధారాలు కూడా ఉన్నాయ‌ని కూడా తెలిపింది. మ‌రి అంతిమ తీర్పు ఎలా ఉంటుందో ? చూడాలి.

బ్రేకింగ్‌: బాబ‌ర్ ఈ మ‌సీదు నిర్మించ‌లేదు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts