బాల‌య్య దెబ్బ‌కు మెగా హీరో అవుట్‌….!

November 18, 2019 at 3:38 pm

నందమూరి హీరో దెబ్బకు మెగా హీరో తోక ముడిచాడా..? న‌ంద‌మూరి టాప్ హీరో సినిమాకు పోటీగా వెళ్ల‌డం ఇష్టం లేక త‌న సినిమాను వాయిదా వేసుకున్నాడా…? అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్‌ వర్గాలు. ఇక డిసెంబర్‌లో రిలీజ్ కాబోతున్న సినిమాల విష‌యానికి వ‌స్తే యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన రూలర్ సినిమా డిసెంబర్ 20న రిలీజ్ కావాల్సి ఉంది. కేఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

అదే సమయంలో మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ సినిమా ప్రతిరోజు పండగే కూడా రిలీజ్‌కు ముహుర్తం ఫిక్స్‌ చేశారు. ఈ సినిమాకు మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాతో అయినా తిరుగులేని క‌మ‌ర్షియ‌ల్ హిట్ కొట్టి ఫామ్‌లోకి రావాల‌ని సాయిధ‌ర‌మ్ క‌సితో ఉన్నాడు. సినిమా టీజ‌ర్ల‌కు, స్టిల్స్‌కు సైతం మంచి రెస్సాన్సే వ‌చ్చింది.

అయితే ఇంత‌లోనే డెసిష‌న్ మార్చుకున్న‌ట్టు టాక్‌.. ? బాలయ్య రూలర్ సినిమాతో పోటీగా వెళితే మొదటికే మోసం వస్తుందనుకున్నారో ఏమో… ఓ వారం తర్వాత రిలీజ్ చేసుకోవచ్చులే అని త‌న సినిమాను ఓ వారం రోజులు పోస్ట్‌పోన్‌ చేసుకున్నట్లు ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది. బాల‌య్య సినిమాకు పోటీగా వెళితే ఓపెనింగ్స్ విష‌యంలో దెబ్బ ప‌డుతుంద‌నే వీళ్లు వెన‌క్కు త‌గ్గిన‌ట్టు టాక్‌… ? మ‌రి దీనిపై మ‌రోసారి క్లారిటీ ఇస్తే కాని అస‌లు నిజం తెలియ‌దు.

బాల‌య్య దెబ్బ‌కు మెగా హీరో అవుట్‌….!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts