బాల‌య్య రూల‌ర్ టీజ‌ర్ విడుద‌ల‌..!

November 21, 2019 at 5:05 pm

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం రూలర్. ప్ర‌ముఖ ద‌ర్వ‌కుడు కే.యస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజ‌ర్‌ను కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.రూల‌ర్ చిత్రం కోసం బాలయ్య పూర్తిగా మేకోవర్ అయి సరికొత్తగా మారిపోయాడు. ఈ సినిమాలో కథ ప్రకారం బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్. ఆ తర్వాత పోలీస్ నుంచి గ్యాంగ్ స్టర్‌గా ఎలా మారాడనేది ఈ సినిమా స్టోరీ.

రూల‌ర్ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్స్‌ ఇప్ప‌టికే విడుదల చేయ‌గా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కోసం పూర్తిగా యంగ్ ‌గా మరిపోయిన బాలయ్య లుక్‌ను చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మరోసారి బాలకృష్ణ ఈ చిత్రంలో డ్యూయల్‌ రోల్లో నటించబోతున్నట్టు సమాచారం. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

టీజ‌ర్‌లో ధ‌ర్మ మా ఊరికే గ్రామ దైవం.. ఎవ్వ‌రికి ఏ క‌ష్టం వ‌చ్చినా త‌నే ముందుంటాడు.. అంటూ ముందుగా వ‌చ్చే మాట‌ల‌తో టీజ‌ర్ ప్రారంభ‌మైంది. టీజ‌ర్‌లో బాల‌య్య రెండు వేరియ‌ష‌న్స్‌లో అద‌ర‌గొట్టాడు. ఓ కార్పోరేట్ లుక్‌లో.. మ‌రోసారి పోలీసాఫీస‌ర్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిస్తున్నాడు. ఇంటిపై ఖాకీ యూనిఫామ్ ఉంటేనే బోనులో పెట్టిన సింహంలా ఉంటాను..యూనిఫామ్ తీసారా.. బ‌య‌టికొచ్చిన సింహంలా ఆగ‌ను.. ఇక వేటే… అంటూ బాల‌య్య డైలాగ్‌లు సినిమాకు హైప్‌ను తెచ్చాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

ఈ టీజ‌ర్‌లో బాల‌య్య రూల‌ర్‌ సినిమాను డిసెంబర్ 20న క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. భూమిక ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. మరి ఈ సినిమాతో బాలయ్య బాక్సాఫీస్ దగ్గర మరోసారి తన సత్తా చూపెడతాడా లేదా అనేది చూడాలి. టీజ‌ర్‌తో సినిమాపై భారీ అంచ‌నాలే పెంచాడు ద‌ర్శ‌కుడు ర‌వికుమార్‌.

బాల‌య్య రూల‌ర్ టీజ‌ర్ విడుద‌ల‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts