నిన్న క‌శ్మీర్‌… నేడు అయోధ్య‌… రేపు పీవోకే… మోదీ స‌ర్కార్ ఘ‌న‌తే

November 9, 2019 at 1:10 pm

బంపర్ మెజారిటీతో రెండో సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం….వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళుతుందనే చెప్పాలి. దశాబ్దాల పాటు పరిష్కారం లేకుండా పడి ఉన్న సమస్యలకు మోదీ సర్కార్ చెక్ పెట్టేస్తుంది. అది కూడా ఇంతవరకు ఏ ప్రభుత్వం టచ్ చేయని సమస్యలని తెరపైకి తెచ్చి పరిష్కారం తెస్తున్నారు. ఇటీవల జమ్మూ-కశ్మీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక తాజాగా దశాబ్దాల పాటు పరిష్కారం కానీ అయోధ్య రామజన్మభూమి విషయంలో కూడా కీలక తీర్పు వచ్చింది.

అయితే ఈ రెండు సమస్యలు పరిష్కారం కావడంతో మోదీ సర్కార్ పాక్ ఆక్రమిత కశ్మీర్(పి‌ఓ‌కే)పై దృష్టిపెట్టినట్లుగా కనబడుతోంది. మరికొద్ది రోజుల్లోనే దానిపైన కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అస్సలు మోదీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే జమ్మూ-కశ్మీర్ విషయంలో అదిరిపోయే నిర్ణయం ఒకటి తీసుకుని పాకిస్తాన్ కు స్ట్రాంగ్ గా చెక్ పెట్టింది. ఆ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసింది.

జమ్మూ-కశ్మీర్, లడఖ్ ప్రాంతాలుగా విడగొట్టి వాటిని కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసింది. దీంతో అక్కడ అధికారం కేంద్రం చేతుల్లోకి వెళుతుంది. ఇంతకాలం స్వయం ప్రతిపత్తి ఉండటం వల్ల అక్కడ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఆ హోదా ఉండటం వల్ల ఆ రాష్ట్రానికి ప్రత్యేక జెండా కూడా ఉండేది.
పైగా ఎన్నో ఏళ్లుగా పాక్ కశ్మీర్ పై కన్ను వేసిన విషయం తెలిసిందే. అక్కడ ఎప్పటికప్పుడు ఉగ్రచర్యలు కూడా జరుగుతున్నాయి. దీంతో ఈ విషయాన్ని సీరియస్ తీసుకున్న మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసేసి, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు.

మొదట్లో దీనిపై అక్కడక్కడ కొంత వ్యతిరేకిత వచ్చిన ఎక్కువమంది స్వాగతించారు. ఇప్పటికీ ఆ వివాదం సద్దుమణిగింది. ఇక ఈ సమస్య తర్వాత కొన్ని దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య సమస్య కూడా నేడు పరిష్కారం దొరికింది. అయోధ్యలో ఉన్న వివాదాస్పద భూమి 2.77 ఎకరాలపై ఎవరికి హక్కు ఉంది అనే దానిపై చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. అది కూడా బీజేపీ ఏదైతే అనుకుంటుందో అదే విధంగా కీలక తీర్పు వెలువరించింది.

ఆ వివాదాస్పద భూమిపై అయోధ్య ట్రస్ట్ కే హక్కు ఉందని, అక్కడ రామమందిరం నిర్మించుకోవచ్చని తెలిపింది. ఇక ఈ భూమి తమదే అనే వాదిస్తున్న సున్నీ వక్ఫ్ బోర్డుపిటిషన్ ని కొట్టేసింది. మసీదు నిర్మించుకోవడానికి మరొక చోట ఐదు ఎకరాలు కేటాయించాలని సుప్రీం చెప్పింది.
మొత్తానికి ఈ తీర్పు మొత్తం పరిశీలిస్తే హిందుత్వ పార్టీగా మనుగడ కొనసాగిస్తున్న బీజేపీకు అనుకూలంగా వచ్చినట్లు అయింది. ఇదే మోదీ సర్కార్ కోరుకుంది కూడా.

మొత్తానికి ఈ విషయంలో మోదీ ప్రభుత్వానికి మరింత మైలేజ్ పెరగనుంది. అయితే జమ్మూ-కశ్మీర్, అయోధ్య సమస్యలు పరిష్కారం కావడంతో…ఇప్పుడు మోదీ పాక్ ఆక్రమిత కశ్మీర్ పై గురిపెట్టినట్లు కనబడుతుంది. తన సహచరుడు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో కలిసి దానిపై వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. దాన్ని కూడా ఆధీనంలోకి తీసుకొచ్చి అఖండ భారతావని చేయాలని మోదీ భావిస్తున్నారు. మరి చూడాలి ఆ సమస్యకు మోదీ సర్కార్ ఎప్పుడు చెక్ పెడుతుందో..?

నిన్న క‌శ్మీర్‌… నేడు అయోధ్య‌… రేపు పీవోకే… మోదీ స‌ర్కార్ ఘ‌న‌తే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts