సీనియర్ నేతలను బాబు ఇంకెన్నాళ్లు మోస్తారు…!

November 19, 2019 at 12:29 pm

సీనియర్ నేతలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇంకెన్నాళ్లు మోస్తారు…? ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం వెతకలేక కార్యకర్తలు సైతం ఇబ్బంది పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు వచ్చిన యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, క‌ర‌ణం బ‌ల‌రాం ఇలా అందరూ సీనియర్ నేతలే ఇప్పుడు ఆ పార్టీలో అన్నీ తామై వ్యవహరిస్తారు. రాజకీయంగా నేడు ఆ పార్టీ ఇబ్బంది పడుతున్న కారణాల్లో ఇది కూడా ఒకటి అనేది పరిశీలకుల మాట. వీళ్ళ పెత్తనమే పార్టీని ముంచింది అని కార్యకర్తలు కూడా అంటూ ఉంటారు.

ఈ ఎన్నిక‌ల్లో కేఈ.కృష్ణ‌మూర్తి, బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి, గౌతు శ్యాంసుంద‌ర శివాజీ లాంటి నేత‌ల‌ను బాబు ప‌క్క‌న పెట్టినా వాళ్ల వార‌సుల‌కే సీట్లు ఇచ్చారు. ఇక ఇప్పుడు పార్టీ ఘోరంగా ఓడిపోయినా చాలా చోట్ల పార్టీలో వృద్ధ‌త‌రం నేత‌ల మాట‌ల‌ను బాబు కాద‌న‌లేని ప‌రిస్థితి ఉంది. వాస్తవానికి టీడీపీకి క్యాడర్ ఎక్కువ. ఈ క్యాడర్లో ఉత్సహం నింపే నేతలు ఎవరూ కూడా చంద్రబాబు పక్కన లేరు అనేది వాస్తవం.

ఆ ప్రసంగాలు పాత చింతకాయ పచ్చడి తరహాలోనే ఉంటున్నాయని కార్యకర్తలు కూడా అంటున్నారు. యువనేతలు ఉన్నా సరే వాళ్ళు వారసత్వ నేతలు కావడం కూడా వారికి చికాకు తెప్పిస్తుంది. పరిటాల శ్రీరామ్, కోడెల శివరాం, బండారు శ్రావణి, రామ్మోహన్ నాయుడు, జెసి పవన్ రెడ్డి, జేసీ.అశ్మిత్‌రెడ్డి, ఆదిరెడ్డి భ‌వానీ, భూమా అఖిల ప్రియా ఇలా నేతలు అందరూ కూడా వారసత్వ నేతలే ఉన్నారు. ఇక ఇటీవ‌లే దేవినేని అవినాష్ పార్టీ నుంచి బయటకు వెళ్లారు. అంతే గాని కార్యకర్తల్లో నుంచి బయటకు వచ్చిన నేత కనపడటం లేదు.

పార్టీ సమీక్షా సమావేశాల్లో ఎక్కువగా సీనియర్ నేతలే కనపడుతున్నారు. రాజకీయంగా అస్తిత్వం కోల్పోయే ప్రమాదం ఉన్నా సరే చంద్రబాబు మారడం లేదు… ఇప్పుడు కార్యకర్తల్లో ఉత్సహం నింపే నేత మాత్రం కనపడటం లేదు. ఇంకెన్నాళ్లు వాళ్ళని పట్టుకుని చంద్రబాబు వేలాడతారు అంటూ కార్యకర్తలు మండిపడుతున్నారు. యువనేతల‌కు పెద్ద పదవులు ఇవ్వాలని సూచిస్తున్నారు కార్యకర్తలు. వారితోనే పోరాటాలు చెయ్యాలి గాని శేష జీవితం గడిపే వాళ్ళతో రాజకీయం ఏంటీ అంటూ మండిపడుతున్నారు.

సీనియర్ నేతలను బాబు ఇంకెన్నాళ్లు మోస్తారు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts