పిల్ల‌ల‌కు సెక్స్ ఎడ్యుకేష‌న్‌… స‌ర్వేలు ఏం చెప్పాయ్‌

November 20, 2019 at 4:52 pm

ర‌తికార్యం గురించి బ‌య‌ట మాట్లాడుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. ర‌తి అంటే ర‌హాస్యం అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు. జ‌నాభా వృద్ధిరేటులో ప్ర‌పంచంలోనే అగ్ర‌గామిగా నిలుస్తున్నా భార‌త్‌..సెక్స్ అవ‌గాహ‌న క‌లిగిన వారి సంఖ్య బ‌హు త‌క్కువ‌ని ప‌లు స‌ర్వేలు తెలియ‌జేయ‌డం విశేషం. చ‌దువుకున్న వారిలోనూ శృంగారంపై క‌నీస అవ‌గాహ‌న ఉండ‌టం లేద‌ని స‌మాచారం. అభివృద్ధి చెందిన దేశాల్లో సెక్స్ అనేది జీవితంలో ఒక భాగంగా ప‌రిగ‌ణిస్తుంటారు.

మ‌నిషికి ఆక‌లి, నిద్ర‌, విశ్రాంతి ఎలాగోన‌ని సింపుల్‌గా తేల్చేస్తుంటారు. అయితే భార‌త్‌లో మాత్రం ఇందుకు విరుద్ధ‌మే. అయితే చిన్న‌త‌నం నుంచే క‌నీస సెక్స్ అవ‌గాహ‌న క‌లిగి ఉంటే పిల్ల‌లకు భ‌విష్య‌త్‌లో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ గురించి అవ‌గాహ‌న క‌ల్పించ‌డం త‌ప్పేమీ కాద‌ని, వారు అనేక ఇబ్బందుల నుంచి దూర‌మ‌వుతార‌ని పేర్కొంటున్నారు.

దుర‌దృష్ట‌వ‌శాత్తు చాలా మంది త‌ల్లిదండ్రులు చిన్నతనంలో పిల్లలు తెలిసీ తెలియక వారి ప్రైవేట్ పార్ట్స్ ని పట్టుకున్నా అదో నేరంలా చూడటం జ‌రుగుతంది. పిల్లలకు ప్రతి ఒక్క విషయం తల్లిదండ్రులు దగ్గరుండి మరీ నేర్ప‌తుంటారు. కానీ సెక్స్ అవ‌గాహ‌నను మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. బాలబాలికలకు కొన్ని సందేహాలు వస్తుంటాయి. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఎలా పంచుకోవాలో కూడా అర్థంకాక చాలా మంది బాల‌లు ఇబ్బంది ప‌డుతున్న‌ట్లు స‌ర్వేల్లో వెల్ల‌డైంది.

సెక్స్ అవ‌గాహ‌న క‌ల్పించ‌క‌పోవ‌డంతో నష్టమే ఎక్కువ జ‌రుగుతోంద‌ని వైద్యులు చెబుతున్నారు. పిల్ల‌ల‌కు త‌ల్లిదండ్రులు అవ‌గాహ‌న క‌ల్పించ‌కుంటే ఏదో ఎవ‌రో చెప్పే విష‌యాల‌ను న‌మ్మి ఆరోగ్యం న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. త‌ల్లిదండ్రుల ఆలోచ‌న తీరులో మార్పు రావాల‌ని, శృంగారాన్ని బూతు అనే భావాన‌ను మెద‌ళ్ల నుంచి తొల‌గించాల‌ని సూచిస్తున్నారు.

పిల్ల‌ల‌కు సెక్స్ ఎడ్యుకేష‌న్‌… స‌ర్వేలు ఏం చెప్పాయ్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts