మెగాస్టార్ క‌థ విన్నాడు..సినిమా హిట్..!

November 19, 2019 at 10:32 am

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి క‌థ విన్నాడు.. ఆ క‌థ‌ను ఎంతో మెచ్చుకున్నాడు.. మేము దైర్యంతో ముందుకు సాగుతున్నాం.. ఖ‌చ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది.. ఎందుకంటే మెగాస్టార్ విన్న క‌థ‌లు సినిమా చేశాను.. అవి హిట్ అవుతున్నాయి… అందుకే ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్ అవుతుంది.. అని న‌మ్మ‌కంగా చెపుతున్నాడు ఆ చిత్ర ద‌ర్శ‌కుడు. మెగాస్టార్ విన్న క‌థ‌లో త‌ప్ప‌కుండా హిట్ అవుతుంద‌ని న‌మ్ముతున్న ఆ ద‌ర్శ‌కుడు ఎవ్వ‌రు… మెగాస్టార్ విన్న ఆ క‌థ ఏమిటీ…

మెగాస్టార్ చిరంజీవి త‌న మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన చిత్రంకు సంబంధించిన క‌థ‌ను ముందుగా విన్నాడ‌ని ఆ చిత్ర ద‌ర్శ‌కుడు మారుతి వెల్ల‌డించారు. ప్ర‌తిరోజు పండుగ సినిమాకు సంబంధించిన ఆస‌క్తి క‌ర‌మైన విష‌యాన్ని ద‌ర్శ‌కుడు మారుతి మీడియాకు వెల్ల‌డించారు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి ప్ర‌తిరోజు పండుగే క‌థ‌ను మూడు గంట‌లు విన్నాడ‌ని, సినిమా స్క్రిప్ట్ చాలా హెల్దీగా చేశావ్ అని ప్రోత్స‌హించారు..

మెగాస్టార్ విన్న ఈ క‌థ‌… ప్రోత్స‌హించ‌డంతో అదే ఎనర్టీతో ముందుకు సాగాము. సినిమాను కూడా బాగానే తీసాం.. సినిమా త‌ప్ప‌కుండా హిట్ కావ‌డం ఖాయ‌మ‌ని మారుతి ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాదు మారుతి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెల్ల‌డించారు. గ‌తంలో మెగాస్టార్ చిరంజీవి భ‌లే భ‌లే మ‌గాడివోయ్ అనే స్క్రిప్ట్ ముందుగా విన్నారు. ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ సినిమాను తెర‌కెక్కించాను.. అది సూప‌ర్ హిట్ అయింది. అందుకే మెగాస్టార్ క‌థ విన్నాడంటే… ఆ సినిమా త‌ప్ప‌కుండా హిట్ కొట్ట‌డం ఖాయ‌మ‌ని ఇది మాకున్న సెంటిమెంట్ అని వెల్ల‌డించారు ద‌ర్శ‌కుడు మారుతి.

మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ప్ర‌తిరోజు పండుగే. ఈసినిమా డిసెంబ‌ర్ 20 ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన ఈ సినిమాను బ‌న్నీవాసు నిర్మించ‌గా, త‌మ‌న్ సంగీతం అందించారు. ఇక తేజ్ స‌ర‌స‌న రాశి ఖన్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. అల్లుడికి హిట్ క‌థ‌ను అందించాల‌ని మెగాస్టార్ స్వ‌యంగా ఈ క‌థ‌ను విన్న‌ట్లు గ‌తంలో ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు ద‌ర్శ‌కుడు మారుతి దాన్ని నిజం చేశారు.

మెగాస్టార్ క‌థ విన్నాడు..సినిమా హిట్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts