దేవినేని చొక్కా ప‌ట్టుకుంటా… వైసీపీ ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్‌

November 9, 2019 at 3:47 pm

మాజీ జ‌ల‌న‌వ‌రుల శాఖా మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు అధికారంలో ఉన్నా.. లేక‌పోయినా వైసీపీని, సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని టార్గెట్ చేయ‌డ‌మే టార్గెట్‌గా పెట్టుకుంటారు. ఐదేళ్ల పాటు మంత్రిగా ఉన్న‌ప్పుడు జ‌ల‌వ‌న‌రుల శాఖ‌లో జ‌రిగిన అవినీతిపై అప్ప‌ట్లో ప్ర‌తిపక్షాలు అసెంబ్లీ వేదిక‌గా పెద్ద యుద్ధ‌మే చేశాయి. చివ‌ర‌కు పోల‌వ‌రం 2017 కు కంప్లీట్ అవుతుంద‌ని.. రాసిపెట్టుకో జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అంటూ బీరాలు పోయారు. ఉమా ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అసెంబ్లీలో ఉండ‌కూడ‌ద‌ని ఆనాడే స‌వాల్ చేసిన జ‌గ‌న్ అక్క‌డ ఉమాకు చిర‌కాల రాజ‌కీయ శ‌త్రువు అయిన వ‌సంత కుటుంబానికి చెందిన వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌ను రంగంలోకి దించి మ‌రీ ఓడించారు.

ఇక జిల్లా రాజ‌కీయాల్లో దేవినేని వ‌ర్సెస్ వ‌సంత ఫ్యామిలీల మ‌ధ్య రాజ‌కీయం గ‌త మూడున్న‌ర ద‌శాబ్దాలుగా కొన‌సాగుతోంది. మూడు ద‌శాబ్దాల త‌ర్వాత ఉమాను వ‌సంత నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడు వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ ఓడించి మ‌రీ అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. వ‌సంత చేతిలో తొలిసారిగా ఓడిన ఉమా అప్ప‌టి నుంచి ఏదో ఒక ఆరోప‌ణ‌లు చేస్తూ కాలం గ‌డుపుతున్నారు. ఎన్నిక‌ల‌కు యేడాది ముందు నుంచే వీరిద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్ధం ముదురుతూ వ‌స్తోంది.

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎప్పుడు దూకుడుగా ఉండే ఉమాకు ఇప్పుడు త‌న‌పై గెలిచిన వ‌సంత దూకుడు ఓ ప‌ట్టాన మింగుడు ప‌డ‌డం లేదు. వ‌సంత దేవినేని రాజ‌కీయాల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ పెడుతూ ముందుకు దూసుకు వెళుతున్నాన‌రు. తాజాగా వ‌సంత నియోజ‌క‌వ‌ర్గంలో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నట్లుగా దేవి నేని ఉమ అదే పనిగా ఆరోపణలు చేస్తున్నారు. తాను తప్పు చేస్తున్నట్లుగా చెప్పటమే కానీ ఎలాంటి ఆధారాలు చూపించని దేవినేని పై వసంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అక్క‌డితో ఆగ‌ని వ‌సంత బుర‌ద‌లో పంది… దేవినేని ఉమ ఒక్క‌టేనంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. మాటలు హద్దులు దాటితే.. తాను దేవి నేని ఉమ ఇంటికి వెళ్లి ఆయన చొక్కా పట్టుకొని మరీ ప్రశ్నిస్తానని మండిపడ్డారు. ఆయనో వెధవ అంటూ విరుచుకుపడ్డారు. ప్ర‌త్య‌ర్థుల‌కు త‌న మాట‌ల‌తో చెమ‌ట‌లు ప‌ట్టించే ఉమాకే వ‌సంత త‌న మాట‌ల‌తో చుక్క‌లు చూపించ‌డంతో ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మ‌రి ఈ తిట్లు వింటే ఉమా చెవులు మూసుకోక త‌ప్ప‌దేమో..!

దేవినేని చొక్కా ప‌ట్టుకుంటా… వైసీపీ ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts