ఆ రెండు రాష్ట్రాల్లో అద్దెకు భార్య‌లు… రేటు ఎంతో తెలుసా..!

November 5, 2019 at 12:30 pm

ప్రస్తుతం సమాజం తీరు మారుతోంది. ఒకప్పుడు మహిళలు అంటే వంటింటి కుందేలు అన్న నానుడి మాత్రమే ఉంది. కానీ నేడు ఆ మహిళలు పురుషులతో పోటీ పడుతూ ఇంకా చెప్పాలంటే.. చాలా అంశాల్లో పురుషులను ఢీ కొడుతూ అన్నిరంగాల్లోనూ వాళ్ళకంటే ముందుకు వెళుతున్నారు. ఇప్పుడు ప్రపంచం అంతా స్మార్ట్ఫోన్ వైపు పరుగులు పెడుతోంది. టెక్నాలజీ అనేది ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసింది. అసలు ఇప్పుడు ప‌క్క‌నోళ్ల గురించి ఎవరికీ పట్టడం లేదు.

ఎవరి ఆలోచనలు వారివి.. ఎవరి కోరికలు వారివి. ఎవ‌రు ఏమైపోయినా మనకు పట్టడం లేదు. ఎవరికివారు సిగ్గు విడిచి బతుకుతున్నారు. ఇలాంటి ఆధునిక యుగంలో భార్యలను అద్దెకు ఇచ్చే సంస్కృతి ఇంకా ఉండటం నీచ‌మ‌నే చెప్పాలి. ఈ సంస్కృతి ఏ యూర‌ప్ దేశంలోనో కాదు… మన దేశంలోనే ఉత్తరాదిలో ఉండటం గమనార్హం. ఉత్త‌రాదిలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ లోని సరిహద్దుల్లో ఉన్న గ్రామాల్లో ప్ర‌స్తుతం భార్యల‌ను అద్దెకు ఇస్తున్నారు.

ఈ స‌రిహ‌ద్దు గ్రామాల్లో ధనవంతులైన‌ యువకులు ఎక్కువ. వాళ్లకు చదువు రాకపోయినా సరే భారీగా ఆస్తులు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో నివసించాలి అంటే వాళ్లకు భార్యలు కావాలి. వయసు మీద పడుతున్నా వివాహం చేసుకోవడానికి మాత్రం అమ్మాయి దొరకడం లేదు. ఇందుకోసం వాళ్లు కొత్త ప్లాన్ వేశారు. పేద‌లైన భ‌ర్త‌ల‌ను పిలిచి మీ భార్య‌ను నాతో కాపురం చేయిస్తే నెల‌కు ఇంత ఇస్తాను అంటూ భేరాలు మాట్లాడుకుంటున్నారు.

వాళ్ల అవ‌స‌రాలు తీరే దాక వాళ్ల‌కు భార్య‌లుగా ఉండాలి. ఇందుకోసం రు.10 వేల నుంచి రు. 50 వేల వ‌ర‌కు బేరాలు న‌డుస్తున్నాయి. అంద‌మైన అమ్మాయిల‌కు రేటు ఎక్కువ కాగా.. ఓ మోస్తరుగా ఉన్న వాళ్ల‌కు మ‌రీ త‌క్కువే ఉంటోంద‌ట‌. ఇక పేద‌లైన వారు త‌మ పిల్ల‌ల చ‌దువులు, కుటుంబ పోష‌ణ కోసం ఇలా అద్దె భార్య‌లుగా వెళ్లుతున్నారు. భర్తలు లేని వాళ్ళు అయితే పిల్లల కోసం దీనిని వృత్తిగా మార్చుకున్నారు. ప్రధాని సొంత రాష్ట్రంలోనే ఈ దారుణాలు బయటకు వచ్చాయి. ఈ దందా కోసం కొత్త‌గా ద‌ళారులు కూడా పుట్టుకు వ‌స్తున్నారు.

ఆ రెండు రాష్ట్రాల్లో అద్దెకు భార్య‌లు… రేటు ఎంతో తెలుసా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts