జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి రీమేక్‌పై ఆ ద‌ర్శ‌కుడు ఏమ‌న్నాడంటే…!

November 8, 2019 at 11:17 am

సిని ప్ర‌పంచంలోనే అతి అతి సుంద‌ర‌మైన సినిమా. సినిమా చ‌రిత్ర‌లో అదో క‌లికితురాయి లాంటిది. అలాంటి సినిమాకు రీమేక్ చేయాల‌నే ఆలోచ‌న చేస్తున్నారు కొంద‌రు. అంత అద్భుత‌మైన బ్లాక్ బ్ల‌స్ట‌ర్ సినిమాకు రీమేక్ చేయాలా వ‌ద్దా అని ఓ ప్ర‌ముఖుడిని అడిగితే ఆ ప్ర‌ముఖుడు ఏన్నాడో వింటే షాక్ తినాల్సిందే. ఇంత‌కు ఎవ‌రా ప్ర‌ముఖుడు, ఏమ‌న్నాడు, ఆయ‌న‌కు ఈ సినిమాకు సంబంధం ఏమిటీ అనుకుంటున్నారా..? అయితే ఓసారి చూద్దాం.

మెగాస్టార్ చిరంజీవి సిని కేరీర్‌లో అత్యంత భారీ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల్లో ఒక‌టైన చిత్రం జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి. ఈ సినిమా విడుద‌ల అయిన రోజుల్లో ప‌రిస్థితులు వేరు అయినా కూడా ఈ సినిమా ఓ భారీ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచి గెలిచింది. అయితే ఈ సినిమాను తెర‌కెక్కించిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె.రాఘ‌వేంధ్ర‌రావు. ఆయ‌న ఈ సినిమా రీమేక్‌పై స్పందించారు. ఈసినిమాను రీమేక్ చేయాల‌నే ఆలోచ‌న మెగాస్టార్ చిరంజీవి కొడుకైన రామ్ చ‌ర‌ణ్ చేసినా, మ‌రెవ‌రు చేసినా అది త‌ప్పు అన్నారు.

ఈ సినిమా విడుద‌ల ప‌రిస్థితుల్లో, సినిమాను మొద‌లు పెట్ట‌ని సంఘ‌ట‌న‌లు అభిమానుల‌తో పంచుకున్న రాఘ‌వేంద్రరావు ఈసినిమాకు ముందు మూడు సినిమా ప్లాప్ అయ్యాయ‌ని, దీంతో ఈసినిమాను నాకు ఇవ్వ‌వ‌ద్ద‌నే ప్ర‌చారం జ‌రిగినా, మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అశ్వినిద‌త్ లు నాపై న‌మ్మ‌కంతో న‌న్నే ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌ని ప‌ట్టుప‌ట్టిన రోజుల‌ను గుర్తు చేసుకున్నారు. అయితే ఆనాడు వ‌ర‌ద‌ల‌తో రెండువారాలు వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో సినిమా టాకీసులు మూత‌ప‌డిన రోజుల‌న్నారు. అయితే సినిమా టాకీసులు ఓపెన్ కాగానే ఈ సినిమాకు ఊహించ‌ని స్పంద‌న‌తో సినిమా భారీ వ‌సూలు చేసి, బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచి మెగాస్టార్, శ్రీ‌దేవిల కేరీర్‌లో ఓమైలురాయిగా నిలిచిపోయింద‌ని ద‌ర్శ‌కుడు గుర్తు చేసుకున్నారు. అందుకే ఈ సినిమాకు రీమేక్ చేసి దీని ఘ‌న‌మైన చరిత్ర‌ను పాడు చేయ‌వద్ద‌ని కోరారు.

జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి రీమేక్‌పై ఆ ద‌ర్శ‌కుడు ఏమ‌న్నాడంటే…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts