ఆ సినిమా కోసం నిర్మాత‌గా ఎన్టీఆర్‌..!

November 9, 2019 at 6:01 pm

స్టార్ డమ్ అందుకున్న సినీ నటులు హీరోలుగా కొనసాగుతూనే, నిర్మాతలుగా కూడా మారిపోతున్నారు. టాలీవుడ్‌లో ఇప్ప‌టికే స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోల వ‌ర‌కు చాలా మంది నిర్మాత‌లుగా మారారు. మహేశ్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, నాని, విజయ్ దేవరకొండ సహా మరికొంత మంది హీరోలు చిత్ర నిర్మాణరంగంలోకి దిగి సక్సెస్ లు అందుకుంటున్న విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు ఈ లిస్టులోకి టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా నిర్మాతగా మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. త్వరలోనే ఆయన నిర్మాణ సంస్థకు సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశముంది. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాలోనే మ‌రో హీరోగా మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కూడా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్న సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాను ఎన్టీఆర్ త‌న సొంత నిర్మాణంలో నిర్మిస్తాడ‌ని తెలుస్తోంది. ఎన్టీఆర్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు సొంత బ్యాన‌ర్ లేక‌పోయినా త‌న సోద‌రుడు క‌ళ్యాణ్‌రామ్‌కు ఎన్టీఆర్ ఆర్ట్స్ ఉంది.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై క‌ళ్యాణ్‌రామ్ వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. ఎన్టీఆర్‌తో కూడా జైల‌వ‌కుశ సినిమా తీశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ సోద‌రుడి బ్యాన‌ర్ మీద కాకుండా తానే నిర్మాత‌గా మారి తానే హీరోగా చేస్తూ సినిమా నిర్మించాల‌నుకోవ‌డం ఇంట్ర‌స్టింగ్‌గా ఉంది.

ఆ సినిమా కోసం నిర్మాత‌గా ఎన్టీఆర్‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts