యంగ్ టైగ‌ర్‌ చేసిన పాత్ర‌లో రౌడీ హీరో..!

November 21, 2019 at 3:34 pm

ఒక్కొక్క‌సారి ఒక పాత్ర క్లిక్ అయితే.. మిగతవారు దాన్ని ఫాలో కావ‌డం కామ‌న్‌. ఇక సిని ప‌రిశ్ర‌మ‌లో అయితే చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఓ పాత్ర స‌క్సెస్ అయితే అదే ఫార్మూల‌తో సినిమా వ‌రుస‌గా వ‌స్తుంటాయి.. ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా అలాంటి ఒక పాత్ర రిఫిట్ కాబోతుంది. యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ పోషించిన పాత్ర రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ పోషించ‌బోతున్నారనే వార్త సోష‌ల్ మీడియాలో ఇప్పుడు హ‌ల్‌ఛ‌ల్ చేస్తుంది. ఇంత‌కు యంగ్ టైగ‌ర్ చేసిన పాత్ర ఏమీటి… రౌడీ హీరో చేయ‌బోతున్న ఆ ప్రాత ఏందీ అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించ‌బోతున్నారు. ఈ సినిమాకు ఫైట‌ర్ అనే టైటిల్ అనుకుంటున్నారు. అయితే ఈ ఫైట‌ర్ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ ఓ న‌త్తివాడిగా న‌టించ‌బోతున్నాడ‌ని టాక్‌. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌త్తివాడిగా న‌టించేందుకు ఓ ప్ర‌త్యేక కార‌ణం ఉంద‌ని ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ ఆలోచ‌న చేస్తున్నాడ‌ని టాక్‌. ఆ కార‌ణంతోనే విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను న‌త్తిపాత్ర‌లో న‌టించేలా పూరి ఒప్పించాడు.

పూరి జ‌గ‌న్నాథ్ ముందుగా ఓ క‌థ‌ను యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు వినిపించాడు. ఆ క‌థ విన్న జూనియ‌ర్ అందులో న‌టించ‌లేదు. కానీ తాను న‌టించిన జై ల‌వ‌కుశ సినిమాలో మూడు పాత్ర‌లో పోషించాడు. ఇందులో రావ‌ణుడి పాత్ర‌లో న‌త్తివాడిగా న‌టించాడు. ఈ న‌త్తి పాత్ర వ‌ర్కట్ అవ్వ‌డ‌మే కాకుండా.. బాక్సాఫీసు వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. అయితే ఈ న‌త్తి పాత్ర ఆలోచ‌న నాదే అని పూరి జ‌గ‌న్నాథ్ ఎంతో మ‌ధ‌న‌ప‌డ్డాడు. అయితే ఇప్పుడు అదే న‌త్తిపాత్ర‌తో త‌యారు చేసిన ఈ ఫైట‌ర్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ నటించబోతున్నాడు. ఇప్పుడు ఈ న‌త్తిపాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఎలా అభిమానుల‌ను అల‌రిస్తారో వేచి చూడాల్సిందే.

యంగ్ టైగ‌ర్‌ చేసిన పాత్ర‌లో రౌడీ హీరో..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts