కార్తీ ‘దొంగ’ టీజ‌ర్‌…!

November 16, 2019 at 1:34 pm

తెలుగు ప్రేక్షకుల‌ను త‌న ఖైదీ చిత్రంలో అల‌రిస్తున్న హీరో కార్తీ. ఈ సినిమా ఇటీవ‌ల విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇంకా అనేక థియోట‌ర్ల‌లో విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతున్న ఖైదీ చిత్రం ఇచ్చిన విజ‌యంతో ఉత్సాహంగా ఉన్న త‌మిళ హీరో కార్తీ ఇప్పుడు దొంగ గా రాబోతున్నాడు. కార్తీ న‌టించిన దొంగ చిత్రం టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

ఈ టీజ‌ర్‌ను దాదాపుగా1.37నిమిషాల నిడివితో రెడి చేశారు చిత్ర ద‌ర్శ‌కుడు జీతు జోసెఫ్‌. ఈ సినిమాలో కార్తీతో పాటుగా జ్యోతిక‌, స‌త్య‌రాజ్ త‌దిత‌ర న‌టులు న‌టించారు. ఈ సినిమా టీజ‌ర్ చూస్తే ఓ ఎమోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ చిత్రంగా తెర‌కెక్కించిన‌ట్లుగా ఉంది. కార్తీ ఈ సినిమాలో కుటుంబ నేప‌థ్యంలో ఎందుకు ఎమోష‌న‌ల్ అయ్యాడు.. చివ‌రికి దొంగ‌గా ఎందుకు మారాడు అనే ఇతివృత్తంతో చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ట్లు టీజ‌ర్‌లో చూస్తే అర్థ‌మవుతుంది.

ఖైదీ చిత్రంలో దాదాపు 100కోట్ల క్ల‌బ్‌లో చేరిన ఈ హీరో ఇప్పుడు దొంగగా టాలీవుడ్‌ను దొచేస్తాడేమో చూడాలి. తెలుగు హీరోల‌కు సాధ్యం కానీ ఈ ఫిట్‌ను ఓ త‌మిళ హీరో సాధించిన 100కోట్ల క్ల‌బ్‌ను దొంగ‌తో మారోమారు ఆ మార్క్‌ను అందుకుంటాడేమో చూడాలి. ఇక దొంగ సినిమా డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ద‌మ‌వుతుంది. ఈ చిత్రానికి ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్‌, టీజ‌ర్‌తో పాటు ఈ ట్రైల‌ర్ బాగానే ఉప‌యోగ‌ప‌డ‌నున్న‌ది. ఏదేమైనా త‌మిళ హీరో కార్తీ మ‌రోమారు దొంగ‌గా బాక్సాఫీసును కొల్ల‌గొట్ట‌డం ఖాయ‌మ‌నే మాట వినిపిస్తుంది.

కార్తీ ‘దొంగ’ టీజ‌ర్‌…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts