కేహెచ్ఆర్ 6666… కేసీఆర్ ఫ్యామిలీలో ట్రెండింగ్‌

November 21, 2019 at 6:02 pm

తెలంగాణ సీఎం కేసీఆర్ ఫ్యామిలీలో ఇప్పుడు కేహెచ్ఆర్ 6666 బాగా హైలెట్ అవుతోంది. అదేంటి గులాబీ బాస్ ఫ్యామిలీలో అంద‌రికి కేసీఆర్‌ తెలుసు.. కేటీఆర్‌ కూడా తెలుసు.. మరీ ఈ కేహెచ్‌ఆర్‌ ఎవరు ? ఇప్పుడు టీ పాలిటిక్స్‌లో ఇదే హాట్ టాపిక్‌. కేహెచ్ఆర్ అనేది ఎవ‌రో సామాన్య జ‌నాల‌కు క‌నుక్కోవ‌డం కాస్త క‌ష్టం అయినా సోష‌ల్ మీడియాలో కాస్త యాక్టివ్‌గా ఉండే వాళ్ల‌కు ఈ కేహెచ్ఆర్‌ను క‌నుక్కోవ‌డం పెద్ద క‌ష్టం కాదు.

ఈ కేహెచ్ఆర్ ఎవ‌రో కాదు తెలంగాణ సీఎం, గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ త‌న‌యుడు, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముద్దుల త‌న‌యుడే. కేసీఆర్ ముద్దుల మ‌న‌వ‌డు అయిన కేహెచ్ఆర్‌.. కేటీఆర్ – శైలిమా దంప‌తుల‌కు ముద్దుల త‌న‌యుడు. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి హిమాన్షు రాజ‌కీయాల‌పై ఆస‌క్తి పెంచుకుంటున్నాడు. పార్టీ వ్య‌వ‌హారాల గురించి తెలుసు కుంటున్నాడు. గ‌తంలో కూడా స‌చివాల‌యానికి వెళ్లి అక్క‌డ పాల‌న ఎలా ? జ‌రుగుతుందో ? కూడా తెలుసుకున్నాడు. ఇది అప్ప‌ట్లో వివాదానికి కూడా దారి తీసింది.

ఇక హిమాన్ష్ త‌న ఇన్‌స్టా గ్రామ్‌కు కేహెచ్ఆర్ 6666 అన్న నెంబ‌ర్ పెట్టుకున్నాడు. ఇంత‌కు ఈ నాలుగు ఆర్ల‌కు ఉన్న ప్ర‌త్యేక‌త ఏంటో తెలుసా… కేసీఆర్ ల‌క్కీ నెంబ‌ర్ కూడా 6 అన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా హిమాన్ష్ చేసిన ఓ ఇంట‌ర్వ్యూ సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. హిమాన్షు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను ఇంటర్వ్యూ చేశారు. స్కూల్ ప్రాజెక్ట్ విషయమై మంత్రిని ఇంటర్వ్యూ చేసినట్లు హిమాన్ష్ సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించాడు.

తాను తెలంగాణ‌లో శిశు సంక్షేమం ఎలా అమ‌ల‌వుతోందో ? తెలుసుకునే క్ర‌మంలోనే స‌త్య‌వ‌తి రాథోడ్‌తో చ‌ర్చించాన‌ని చెప్పిన హిమాన్ష్‌.. ఈ ఇంట‌ర్వ్యూ ఫొటో త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెల్ల‌డించాడు. హిమాన్ష్.. స‌త్య‌వ‌తితో క‌లిసి సైదాబాద్‌లోని బాల నేరస్థుల జువైనల్‌ హోంను సందర్శించి… అక్క‌డ ప‌రిస్థితులు ఆరా తీశాడు. త‌న స్కూల్లో బాల‌ల సంక్షేమంపై ప్రాజెక్ట్ వ‌ర్క్ కోసం ఈ ఇంట‌ర్వ్యూ చేశాడ‌ట‌. ఏదేమైనా క‌ల్వ‌కుంట్ల కుటుంబంలో మూడో త‌రం కూడా అటు రాజ‌కీయాల ప‌రంగా.. ఇటు సోష‌ల్ మీడియాలో చాలా
యాక్టివ్‌గా ఉంటోంది.

కేహెచ్ఆర్ 6666… కేసీఆర్ ఫ్యామిలీలో ట్రెండింగ్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts